Beauty Tips: ఈరోజుల్లో మెరిసే ముఖాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. ఇందుకోసం చాలామంది ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ, ఈ ప్రొడక్ట్స్ ఆశించిన ప్రయోజనాలను అందించనప్పటికీ, కొన్నిసార్లు వాటి దుష్ప్రభావాల కారణంగా మొటిమలు, దద్దుర్లు, చర్మ ఇన్ఫెక్షన్లు కూడా వేధిస్తుంటాయి. ఇటువంటి పరిస్థితిలో మన వంటగదిలో ఉండే కొన్ని ఆహార పదార్థాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఈ పదార్థాలు ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా సహజంగా అందాన్ని పెంచుతాయి. ఈ పద్ధతులు చర్మానికి సురక్షితమైనవి, సులభమైనవి! ఈ క్రమంలో ముఖ అందానికి సహాయపడే కొన్ని ఆహార పదార్థాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పసుపు: పసుపు సహజ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పాలు లేదా పెరుగుతో పసుపు ప్యాక్‌ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా అవుతుంది. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే సరిపోతుంది.
తేనె: తేనెలో యాంటీ బాక్టీరియల్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని మెరుపును పెంచుతుంది. ముఖానికి కొద్దిగా తేనెను అప్లై చేసి కొద్దిసేపు తర్వాత మంచి నీటితో కడగాలి.
also read:Aloe Vera Juice: లైట్ తీసుకోకండి..కలబంద జ్యూస్ తాగితే ఊహకందని ఉపయోగాలు..
పెరుగు: పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. పెరుగుతో కొద్దిగా తేనె లేదా పసుపు కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వాడితే చర్మం సహజ కాంతి పెరుగుతుంది.
బంగాళాదుంప: పచ్చి బంగాళాదుంప చర్మానికి సహజ బ్లీచ్‌గా పనిచేస్తుంది. బంగాళాదుంప రసం ముఖానికి అప్లై చేయడం వల్ల మచ్చలు తగ్గుతాయి. బంగాళాదుంపలలోని ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు యవ్వన యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
దోసకాయ: దోసకాయలో నీరు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని చల్లబరిచి, ముఖంపై తేమ దూరం చేస్తుంది. దోసకాయ రసం లేదా ముక్కలను ముఖానికి పూయడం వల్ల చర్మం ఉంటుంది. వేసవిలో చర్మాన్ని చల్లబరచడానికి, కాంతిని పెంచడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


