Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Guava Leaf Powder: జామ ఆకు పొడితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా ?

Guava Leaf Powder: జామ ఆకు పొడితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా ?

Guava Leaf Powder Benefits: మన ఇంటి పెరట్లో పెంచే పండ్లలో జామపండుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. జామలో బోలెడన్ని విటమిన్‌లు లభిస్తాయి. ముఖ్యంగా ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదండోయ్ జామపండు మాత్రమే కాకుండా దాని ఆకులు కూడా అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఈ జామ ఆకులతో చేసిన పొడిని వాడుతున్నారు. ఈ-కామర్స్‌ వేదికల్లో సైతం దీనికి భారీ డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో జామ ఆకులు దీనితో తయారు చేసే పొడి వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

జామ ఆకుల ఆరోగ్యలాభాలు:  జామ ఆకులలో అనేక రకాల పోషకాలు దొరుకుతాయి. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్‌లు, విటమిన్‌ సి, పాలీఫెనాల్స్, ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఈ పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా జామ ఆకులను ఎండబెట్టి తయారు చేసిన పొడి అనేక ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

జామ ఆకుల పొడి వల్ల కలిగే ఉపయోగం:

  • జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో:  జామ ఆకులలో ఉండే యాంటీ- మైక్రోబయల్‌ లక్షణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. ప్రతిరోజు ఉదయం జామ ఆకుతో తయారు చేసిన పొడిని నీటిలో కలుపుకొని తాగడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.  అంతేకాకుండా పేగులలోని చెడు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ఈ జామపొడిని ఉపయోగించడం మంచిది. అయితే ఈ పొడిని ఉపయోగించే ముందు మీ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

ALSO READ: https://teluguprabha.net/lifestyle/follow-these-home-tips-for-stomach-pain-releif/

  • రోగనిరోధక శక్తి పెంపు: జామాకులో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ సి ఇమ్యూనిటీని పెంచుడంలో సహాయపడుతుంది. దీని వల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్‌ జామపొడిని కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
  • జుట్టు రాలకుండా: ప్రస్తుతకాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు జామాకుల పొడి మేలు చేస్తుంది. జామపొడితో తయారు చేసిన హెయిర్‌ మాస్క్‌ను ఉపయెగించడం వల్ల జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. ఈ హెయిర్‌ మాస్క్‌ను వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే బోలెడు లాభాలు పొందవచ్చు.

ALSO READ:https://teluguprabha.net/lifestyle/neem-face-pack-for-beautiful-face-know-how-prepare-face-pack-and-its-benefits/

  • చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌: జామాకుల పొడితో తయారు చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను నియంత్రించుకోవచ్చు.  చెడు కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు కలిగే అవకాశం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొలెస్ట్రా్ల్ అధికంగా ఉండే వారు సాధారణ టీ కి బదులుగా ఈ జామాకుల పొడి టీని తాగడం మేలు.
  • అధిక బరువు తగ్గడంలో: అధిక బరువు సమస్యతో బాధపడేవారికి జామాకుల పొడి ఎంతో మేలు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే  మెటబాలిజం రేటును పెంచుతుంది. దీని వల్ల శరీరంలో ఉండే కొవ్వు త్వరగా కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా డైట్‌లో జామ ఆకుల పొడిని ఉపయెగించడం మంచిది.
  • చర్మ ఆరోగ్యం: జామాకుల పొడిలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ , యాంటీ- ఆక్సిడెంట్‌ లక్షణాలు బోలెడు ఉంటాయి. ఇది చర్మంపై కలిగే మొటిమలను, నల్ల మచ్చలను, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. చాలా మంది ఈ పొడితో ఫేస్ ప్యాక్ చేసుకుంటారు. ఈ ప్యాక్‌ను ఉపయోగించడం వల్ల చర్మం ఎంతో కోమలంగా ఉంటుంది.

జాగ్రత్తలు:

జామాకులో క్వెర్సెటిన్‌, అపిజెనిన్‌, గాలిక్‌ యాసిడ్‌ ఇతర కెమికల్స్‌ ఉంటాయి. ఈ కెమికల్స్‌ డయాబెటిస్‌, జీర్ణ సమస్యలు, క్యాన్సర్‌ వంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది.  అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తక్కువగా తీసుకోవడం మంచిది. రోజు రెండు కప్పుల జామాకుల టీని తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. జామాకుల టీ తీసుకోవడానికి ఇష్టపడని వారు రోజు ఒక పండు తినడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు పొందవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad