Wednesday, June 25, 2025
Homeలైఫ్ స్టైల్Hair Fall:సీజనల్ హెయిర్ ఫాల్..ఈ 3 హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ లు ట్రై చేయండి..

Hair Fall:సీజనల్ హెయిర్ ఫాల్..ఈ 3 హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ లు ట్రై చేయండి..

Hair Fall Masks: ఆడవారికి అసలైన అందం పొడవాటి జుట్టు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే షాంపు ఒక్కటే వాడడం కరెక్ట్ కాదు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు హెయిర్ కేర్ ఉపయోగించాలి. దీంతో జుట్టు సహజం మెరుపు చెక్కుచెదరకుండా ఉంటుంది. వర్షాకాలంలో జుట్టుకు చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి అనేక సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలను ఎదుర్కోవడానికి సహజంగా తయారు చేసిన హెయిర్ కేర్ మాస్కులు వాడవచ్చు. ఇప్పుడు జుట్టు ఆరోగ్యం కోసం మూడు హెయిర్ మాస్కులను చూద్దాం.

పెరుగు, తేనె
పెరుగు, తేనె ఎయిర్ మాస్క్ జుట్టును ఎక్కువ కాలం ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయాలంటే పెరుగుతో తేనె కలిపి తడి చుట్టూ పై అప్లై చేయాలి. దీని తర్వాత ఒక గంట పాటు ఆగి జుట్టును శుభ్రంగా కడగాలి.

కొబ్బరి పాలు, కలబంద
జుట్టుకు కొబ్బరి పాలు, కలబంద ఒకటి కాదు రెండు కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల జుట్టుకు ఉపశమనం కలిగి జుట్టు రాలకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది జుట్టుకు తేమను అందిస్తుంది, నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి తాజా కలబంద జెల్ ను కొబ్బరిపాలతో కలపాలి. తర్వాత దీనిని తలపై పూయాలి. దాదాపు 30 నిమిషాల తర్వాత జుట్టును నీటితో శుభ్రంగా కడగాలి.

ఆలివ్ నూనె, గుడ్డు
గుడ్డు, ఆలివ్ నూనెలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బలంగా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ఆలివ్ నూనె గుడ్డును కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. దీనిని తలపై అప్లై చేసి దాదాపు 30 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీరు లేదా తేలికపాటి షాంపుతో కడగాలి. ఈ సహజ మాస్క్ చిక్కుబడ్డ జుట్టును తగ్గిస్తుంది. జుట్టు మందంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News