Monday, November 17, 2025
Homeలైఫ్ స్టైల్Home Care: ఇంట్లో తేమ పెరిగిపోయిందా..? ఈ టిప్స్ పాటిస్తే చాలు..

Home Care: ఇంట్లో తేమ పెరిగిపోయిందా..? ఈ టిప్స్ పాటిస్తే చాలు..

Home Care Tips: వర్షాకాలం వచ్చేసింది. దీంతో ఇంట్లో తేమ పెరిగిపోతుంది. దీని ప్రభావం అటు వస్తువుల పైనే కాకుండా ఆరోగ్యం పై కూడా పడుతుంది. ఇంట్లో తేమ కారణంగా గోడలపై ఫంగస్ పెరగడం, వస్తువులు బూజు పట్టడం.. ఫలితంగా శ్వాస సమస్యలు, అలెర్జీలు, చర్మ సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వెంటిలేషన్ తక్కువగా ఉన్న ఇళ్లలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే, ఇంట్లో తేమను దూరం చేయడం కష్టంగా అనిపించినా కొన్ని సులభమైన గృహ ఉపాయాలను అనుసరించడం ద్వారా తొలగించవచ్చు. ఈ నివారణలు తేమను తొలగించడమే కాకుండా ఇంటిని తాజాదనంతో నింపుతాయి.

- Advertisement -

బేకింగ్ సోడా ఉపయోగించడం

బేకింగ్ సోడా ఒక సహజ దుర్గంధనాశని. ఇంట్లో తడిగా ఉన్న ప్రదేశాలపై చల్లాలి లేదా ఒక గిన్నెలో నింపి గది మూలల్లో ఉంచాలి. దీంతో బేకింగ్ సోడా తేమను సులభంగా గ్రహిస్తుంది. అయితే, ప్రతి 4-5 రోజులకు బేకింగ్ సోడాను మారుస్తూ ఉండాలి.

వేప ఆకులు

వేపలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి తడిగా ఉన్న గోడలపై పిచికారీ చేయాలి. దీని వల్ల శిలీంధ్రాల పెరుగుదల తగ్గుతుంది. పైగా దుర్వాసన, వస్తువులపై బూజు పట్టడం తగ్గుతుంది.

Also Read: Anjeer fruit: అంజీర్‌ పండ్లతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..

బొగ్గు

తేమను తొలగించడానికి మరో చిట్కా బొగ్గు వాడకం. బొగ్గు తేమ, దుర్వాసనను పీల్చుకోవడానికి పనిచేస్తుంది. బొగ్గును చిన్న సంచుల్లో వేసి అల్మారా, స్టోర్‌రూమ్ లేదా బాత్రూమ్ వంటి ప్రదేశాలలో పెట్టాలి. దీంతో తేమ తొలిగిపోతుంది. ఇది ఎక్కువ కాలం తేమను నియంత్రిస్తాయి.

వెంటిలేషన్‌

తేమకు అతిపెద్ద కారణం వెంటిలేషన్ తక్కువగా ఉండటం. ఇంట్లోకి సరైన గాలి ప్రవాహం లేకపోవడం. తేమను తగ్గించేందుకు స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేలా రోజుకు కనీసం 1-2 గంటలు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా డియోడరైజర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

వెనిగర్

వైట్ వెనిగర్ ని నీటిలో కలిపి ఈ మిశ్రమాన్ని తడిగా ఉన్న గోడలు పై చల్లాలి. వెనిగర్ బూజును తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా దుర్వాసనను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad