Monday, November 17, 2025
Homeలైఫ్ స్టైల్Coconut Oil: పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.. కొబ్బరి నూనెతో ముఖం మెరిసిపోతుంది

Coconut Oil: పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.. కొబ్బరి నూనెతో ముఖం మెరిసిపోతుంది

Coconut Oil Vs Makeup: చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి సహజ పద్ధతులు ఎప్పుడూ సురక్షితం. అందులో కొబ్బరి నూనెతో ఫేస్ వాష్ చేయడం ఒక సులభమైన, ఫలితమైన మార్గంగా బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో సహజమైన తేమ, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మానికి మృదుత్వం, కాంతి వస్తాయి. మేకప్ తొలగించడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కృత్రిమ రసాయనాల్లాంటి దుష్ప్రభావాలు లేకుండా చర్మానికి సహజ రక్షణనిస్తుంది.

- Advertisement -


నెటిరియస్ మాయిశ్చరైజర్‌లా..

కొబ్బరి నూనె చర్మానికి నెటిరియస్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీన్ని సరిగ్గా వాడితే చర్మం ఎక్కువసేపు తేమతో నిండుగా ఉంటుంది. పొడిబారిన చర్మం సమస్య తగ్గుతుంది. చర్మం మృదువుగా, సాఫ్ట్‌గా మారుతుంది. అంతేకాక, చర్మం చిన్న చిన్న గాయాలు మానిపించడంలో కూడా ఇది సహాయపడుతుంది. రోజువారీ మేకప్ తీసేసిన తరువాత కూడా కొబ్బరి నూనె వాడితే మంచిది.

కొబ్బరి నూనె వాడాలంటే..

ఫేస్ వాష్ కోసం కొబ్బరి నూనె వాడాలంటే ముందుగా నాణ్యమైన, ముఖ్యంగా ఆర్గానిక్ ఆయిల్ ఎంచుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నూనెను చేతిలో తీసుకుని మృదువుగా రబ్ చేయాలి. గడ్డ కట్టిన నూనె అయితే ముందుగా కరిగించాలి. చేతుల్లో సన్నగా స్ప్రెడ్ చేసిన తరువాత మునివేళ్లతో మెల్లగా ముఖంపై అప్లై చేయాలి. మొదట కళ్ల కింద, తరువాత చెంపలు, తరువాత మిగతా ముఖంపై సమానంగా రాయాలి. మేకప్ ఎక్కువగా ఉన్న భాగాలు లేదా పొడిబారిన చోట్ల కొంచెం ఎక్కువగా నూనె రాయడం మంచిది.

మసాజ్ చేస్తూ….

మసాజ్ చేస్తూ నూనె చర్మంలో లోతుగా ఇంకేలా చూడాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. నుదురు, ముక్కు, పెదాల చుట్టుపక్కల ప్రాంతాలు మరిచిపోకుండా అప్లై చేయాలి. అయితే జాగ్రత్తగా చేయాల్సిన విషయం ఏంటంటే, నూనె కళ్లలోకి పోకుండా ఉండాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. అంటే ముఖంలో చిన్న ప్రాంతంలో కొద్దిగా నూనె రాసి, కొద్దిసేపు ఉంచి, ఎలాంటి మంట లేదా ఇరిటేషన్ లేకపోతే మిగతా ముఖానికి అప్లై చేయాలి.

Also Read: https://teluguprabha.net/lifestyle/harvard-study-finds-lithium-deficiency-link-to-alzheimer-disease/

మసాజ్ చేసిన తరువాత శుభ్రం చేయడం కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉండాలి. శుభ్రమైన సాఫ్ట్ క్లాత్ తీసుకుని, గోరువెచ్చని నీటిలో ముంచి, తేలికగా పిండి, ముఖం మొత్తాన్ని సున్నితంగా తుడవాలి. ఇది చర్మంపై ఉండే జిడ్డుదనం తొలగించడమే కాకుండా నూనె లోపల ఇంకేలా సహాయం చేస్తుంది. మసాజ్ చేసిన తరువాత కనీసం 15 నిమిషాలు అలాగే ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. 30 నిమిషాలు ఉంచితే ఇంకా బెటర్.

Also Read: https://teluguprabha.net/lifestyle/home-remedies-to-restore-shine-to-tarnished-silver-jewelry/

మరో విధానం ఏమిటంటే, గోరువెచ్చని నీటిలో ముంచిన సాఫ్ట్ క్లాత్‌ని తడిగా ఉంచి, ముఖంపై పూర్తిగా కప్పుకోవాలి. ఇది చర్మంలోని రోమకూపాలు తెరుచుకోవడంలో, మురికి తొలగించడంలో సహాయపడుతుంది. కనీసం ఒక నిమిషం పాటు ఇలా ఉంచి, తరువాత క్లాత్‌ను తీసేయాలి.

ఈ పద్ధతిని తరచూ పాటించడం వల్ల మేకప్ తొలగింపుతో పాటు చర్మానికి సహజమైన కాంతి వస్తుంది. కొబ్బరి నూనెతో ఫేస్ వాష్ చేయడం చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. రసాయన ప్రోడక్ట్స్ అవసరం లేకుండా సహజంగా చర్మ సంరక్షణ జరుగుతుంది.రోజువారీగా లేదా కొన్నిసార్లు వారానికిఈ విధానాన్ని అనుసరిస్తే ఎల్లప్పుడూ చర్మం హెల్దీగా, కాంతివంతంగా ఉంటుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్న వారు, డ్రై స్కిన్ కలవారు ఈ పద్ధతిని ఉపయోగిస్తే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad