Curry Leaf Plantation: అందరి వంటింట్లో కరివేపాకు ఉంటుంది. దీన్ని అనేక వంటకాల్లో ఉపయోగిస్తాం. కరివేపాకు ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇన్ని లాభాలను అందిస్తున్న ఈ ఆకును మార్కెట్లో కొనుగోలు చేయకుండా ఇంటి ప్రాంగణంలో చిన్న స్థలంలో ఉన్న కూడా నాటవచ్చు లేదా కుండలో నాటిన ఈ కరివేపాకు మొక్కని బాల్కనీ ప్రాంగణం, టెర్రర్స్ మీద కూడా ఉంచవచ్చు.
కరివేపాకు మొక్కను నాటిన తర్వాత, దానికి ఎక్కువ జాగ్రత్త అవసరం లేదు. సరైన మార్గంలో సమయానికి నీరు, సూర్య రష్మీ, ఎరువులు ఇవ్వడం ద్వారా అది త్వరగా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కథనం ద్వారా కరివేపాకు మొక్కను పెంచడానికి సంరక్షణ చిట్కాలు తెలుసుకుందాం.
విత్తనాలు లేదా మొక్క
కరివేపాకుని పెంచడానికి నర్సరీ నుండి ఒక మొక్కను కొనుగోలు చేయవచ్చు లేదా విత్తనాలను తెచ్చి నాటవచ్చు. అయితే విత్తనం నుండి మొక్క మొలవడానికి సమయం పడుతుంది. నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను నాటడం ద్వారా ఆకులు త్వరగా రావడం ప్రారంభిస్తాయి.
కుండ, నేల
చిన్న స్థలంలో బాల్కనీ ప్రాంగణం లేదా టెర్రర్స్ మీద కరివేపాకును పెంచాలనుకుంటే కనీసం 12 అంగుళాల లోతులో ఉన్న ఒక కుండను తీసుకోవాలి. తద్వారా కరేపాకు వేర్లు లోపల వ్యాప్తి చెందడానికి తగినంత స్థలం లభిస్తుంది. మట్టికోసం యాభై శాతం తోట మట్టి, ఇరవై ఐదు శాతం ఆవు పేడ ఎరువు, ఇరవై ఐదు శాతం ఇసుకను నెలలో కలిపి కుండలో వేయాలి. ఈ మిశ్రమం మొక్కకు పోషకాలు, నీటిపారుదల కోసం మంచిది.
సూర్యరష్మీ, నీరు
కరివేపాకు మొక్కకు ప్రతిరోజు కనీసం ఐదు నుండి ఆరు గంటలు ప్రత్యక్ష సూర్యకాంతి పడాలి. ఇక నీరు విషయానికి వస్తే ఈ మొక్కకు వేసవిలో ఉదయం లేదా సాయంత్రం నీరు పెట్టాలి. శీతాకాలంలో మాత్రం వారానికి రెండు నుంచి మూడుసార్లు నీరు పెట్టడం సరిపోతుంది.
ఎరువులు, సంరక్షణ
కరివేపాకు మొక్క సంరక్షణ కోసం ప్రతి రెండు నుంచి మూడు నెలల కు ఆవుపేడ ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వేయాలి. మొక్క పాత ఆకులు, పసుపు ఆకులు ఉంటె తొలగించాలి. తద్వారా ఇది కొత్త ఆకులను త్వరగా రావడానికి సహాయపడుతుంది.
తెగుల నియంత్రణ
ఆకులపై కీటకాలు లేదా అఫిడ్స్ దాడి చేస్తాయి. ఇందుకోసం నీటిలో కలిపిన వేప నూనెను పిచికారి చేయాలి. ఇది మొక్కను సహజ పద్ధతిలో కాపాడుతుంది.


