Gardening Tips: వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్ పచ్చదనం, చల్లదనాన్ని తీసుకొస్తుంది. అయితే, వర్షాకాలంలో ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలపై కీటకాలు దాడి చేస్తాయి. వర్షాకాలంలో తేమ, నీరు చేరడం, తక్కువ సూర్యరశ్మి కారణంగా మొక్కలలో ఫంగల్ ఇన్ఫెక్షన్, తెల్ల కీటకాలు, ఆకు తినే కీటకాల వంటి అనేక కీటకాల ప్రమాదం పెరుగుతుంది. ఈ కీటకాలు మొక్కల వేర్లు, ఆకులు, పువ్వులను దెబ్బతీస్తాయి.
అయితే, మొక్కలను రక్షించేందుకు ప్రతిసారీ రసాయన స్ప్రే వాడటం మొక్కల ఆరోగ్యానికి మంచిది కాదు.ఇటువంటి పరిస్థితిలో దేశీయ, సహజ నివారణలు ఉత్తమమైనవి. ఇవి పూర్తిగా విషపూరితమైనవి కావు. పైగా పర్యావరణానికి ఎంతో మంచిది. ఈ నేపథ్యంలో కీటకాల నుండి మొక్కలను రక్షించడానికి 5 ప్రభావవంతమైన దేశీయ ఉపాయాలను తెలుసుకుందాం.
1. మొక్కలను కీటకాల నుంచి రక్షించేందుకు వేప ఒక అద్భుతమైన సహజ పురుగుమందు. ఇందుకోసం వేప ఆకులను నీటిలో బాగా మరిగించి స్ప్రే లాగా తయారు చేయాలి. తర్వాత దీని మొక్కలపై పిచికారీ చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు మొక్కలపై పిచికారీ చేయాలి. ఇది తెల్ల ఈగ, అఫిడ్స్, ఫంగస్ వంటి కీటకాల నుండి మొక్కలను రక్షిస్తుంది.
2. వర్షాకాలంలో మొక్కలను కాపాడేందుకు మరో చిట్కా 10 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చి మిరపకాయలను రుబ్బి 1 లీటరు నీటిలో కలపాలి. ఈ ద్రావణాన్ని ఒక రోజు మూసి అలాగే ఉంచాలి. మరుసటి రోజు దీని వడకట్టి స్ప్రే లాగా తయారు చేసి మొక్కలపై పిచికారీ చేయాలి. ఈ దేశీయ పద్ధతి కీటకాలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
Also Read: Parenting Tips: పిల్లలతో సమయం గడపలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
3. మొక్కలు ఉన్న ప్రదేశంలో ఆవాల పొడిని నేలలో కలపాలి. ఇలా చేయడం వల్ల ఆవాల పొడి వేర్లపై దాడి చేసే కీటకాలును దూరం చేస్తుంది. ఈ నివారణ ముఖ్యంగా కుండలలో ఉన్న మొక్కలకు ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మొక్కల పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది.
4. ఈ సీజన్ లో మొక్కలను కాపాడేందుకుమరో టిప్ నేలలో కలప లేదా ఆవు పేడ బూడిదను ఉంచడం. దీని వల్ల కీటకాలు దూరంగా ఉంటాయి. బూడిదలో ఉండే ఖనిజాలు కూడా మొక్కను పోషిస్తాయి. కీటకాలను తరిమికొడతాయి. ఇలా ప్రతి 10-15 రోజులకు ఒకసారి చేయాలి.
5. పసుపు, మజ్జిగ ద్రావణాన్ని చల్లడం ద్వారా కూడా మొక్కలను కీటకాల నుంచి కాపాడొచ్చు. ఈ మిశ్రమానికి 1 లీటరు మజ్జిగలో 2 టీస్పూన్ల పసుపు కలిపి స్ప్రే లాగా చేయాలి. తర్వాత మొక్కలపై పిచికారీ చేయాలి. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్. అంతేకాకుండా ఈ చిట్కా వర్షంలో ఆకులు కుళ్ళిపోకుండా నిరోధిస్తుంది. కీటకాలను దూరంగా ఉంచుతుంది.


