Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Health Tips: క్యారట్ సలాడ్ తో మెరిసే చర్మం మీ సొంతం..

Health Tips: క్యారట్ సలాడ్ తో మెరిసే చర్మం మీ సొంతం..

Carrot Salad: మీ చర్మం కాంతివిహీనంగా కనిపిస్తోందా? మ్రుదుత్వం కనిపించడం లేదా? అయితే, విటమిన్లు పుష్కలంగా ఉన్న క్యారట్ సలాడ్ తింటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. ముఖ్యంగా ఎండా కాలంలో చర్మం తొందరగా కమిలిపోతుంది. పైగా నల్లగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో క్యారట్ సలాడ్ తింటే చర్మంపై ప్రభావం చూపుతుంది. పచ్చి క్యారట్ ను తింటే చర్మం మెరుపులు చిందిస్తూ కాంతివంతంగా తయారవుతుంది. రెడ్ క్యారట్ సలాడ్ కూడా చర్మాన్ని పట్టులా మెత్తగా ఉంచుతుంది. క్యారట్ లో రెటినల్ అని ఉంటుంది. ఇది ఒకరకమైన విటమిన్ ఎ. మార్కెట్లో దొరికే రకరకాల స్కిన్ క్రీమ్స్, సిరమ్స్, లోషన్లలో కూడా రెటినల్ ను ఎక్కువగా వాడతారు. స్కిన్ కణాల ఉత్పత్తిని ఇది పెంచుతుంది. చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేయడం, చర్మ రంధ్రాలను శుభ్రపరచడం, కొలాజిన్ ఉత్పత్తిని పెంచడం ఇది చేస్తుంది. ఫలితంగా ముఖంపై గీతలు , ముడతలు ఏర్పడవు.

- Advertisement -

Also Read: Migraine: వాతారవరణ మార్పుల వల్ల మైగ్రేన్ అటాక్స్..ఎలా తగ్గించుకోవాలంటే..?

అంతేకాదు చర్మం ఎప్పుడూ తాజాదనంతో మెరుస్తుంది. బెటా కెరొటినాను ఫుడ్ లో తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ ఎ పెంచుకోవచ్చు. దాన్ని మన శరీరం రెటినల్ గా మార్చుతుంది. క్యారట్లల్లో బెటా కెరొటినా పుష్కలంగా ఉంటుంది. అలాంటి క్యారట్లతో చేసే సలాడ్ చర్మానికి చాలా మంచిది. ఇందులోని విటమిన్ ఎ చర్మానికి ఎంతో మంచిది. ఇది ఫ్యాట్ సొల్యుబుల్ కాంపౌండ్ కూడా! ఈ సలాడ్ లో రెడ్ క్యారట్లు వాడతారు. వీటిల్లోని రెటినల్ వల్ల చర్మం కాంతివంతమవుతుంది. అలాగే ఇందులో వాడే వెనిగర్ జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో వేసే ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇక ఇందులో వాడే నువ్వులు శరీరానికి యాంటాక్సిడెంట్లను అందిస్తుంది. ఈ సలాడ్ లో చల్లే ఉప్పు బ్యాలెన్సింగ్ యాక్ట్ గా పనిచేస్తుంది.

ALSO READ: https://teluguprabha.net/lifestyle/how-to-reduce-migraine-attacks-due-to-climate-change/

సలాడ్ ఎలా తయారు చేసుకోవాలి?

ఈ క్యారట్ సలాడ్ చేయడానికి రెండు లేదా మూడు క్యారట్లను తీసుకుని వాటిని బాగా కడగాలి. తర్వాత వాటిపై ఉన్న తొక్కను తీసేయాలి. ఆ తర్వాత క్యారట్ ను సన్నగా తురమాలి. ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం లేదా వెనిగర్ తో పాటు ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ వేసి కలపాలి. అందులో తురిమిన క్యారట్ వేసి దానిపై కొద్దిగా ఉప్పు, నువ్వులు చల్లాలి. ఆ తర్వాత మరోసారి ఆ మిశ్రమాన్ని స్పూన్ తో బాగా కలిపి తినాలి. ఇది చర్మాన్ని మెరిపించడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా మనకు అందిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు ? మీరూ ప్రయత్నించండి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad