Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Food Habits: భార్యభర్తలిద్దరూ కలిసి తింటున్నారా...లావైపోతారు..జాగ్రత్త!

Food Habits: భార్యభర్తలిద్దరూ కలిసి తింటున్నారా…లావైపోతారు..జాగ్రత్త!

Married Couple VS Food Habits: ఇటీవల కాలంలో వివాహిత జంటల్లో అధిక బరువు లేదా ఊబకాయం సమస్య గణనీయంగా పెరుగుతోంది. చాలామంది నిపుణులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం, భార్యాభర్తలు ఒకేలా తినే అలవాట్లు, కలిసిన జీవనశైలి, రోజూ కలసి గడిపే సమయం వారిలో లావు అవ్వడానికి దారితీస్తున్నాయనేది స్పష్టమవుతోంది.

- Advertisement -

ఆహారం నుంచి వ్యాయామం వరకూ…

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు చేసిన పరిశోధనలు వెల్లడించిందేంటంటే, వివాహితులలో ఒకరి జీవనశైలి మరొకరిపై ప్రభావం చూపుతుందని, అది ఆహారం నుంచి వ్యాయామం వరకూ ప్రభావం చూపుతోందని తెలిపాయి. సింగిల్‌ గా ఉన్నవాళ్లతో పోలిస్తే వివాహిత జంటల్లో అధికబరువు శాతం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇవాళ డేటింగ్ కల్చర్, ఫుడ్ ఆర్డర్ యాప్స్, సోషల్ గ్యాదరింగ్స్ వంటివి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. బయట తినడం, రాత్రిళ్లు ఆలస్యంగా తినడం, అధికకాలరీలతో కూడిన ఆహారాన్ని స్నేహంగా పంచుకోవడం వంటివి ఆహారపు నియంత్రణను దెబ్బతీస్తున్నాయి. ఇవే లావు అవ్వడానికి కారణమని సర్వేలు చెబుతున్నాయి.

ALSO READ: https://teluguprabha.net/lifestyle/can-you-eat-dates-during-pregnancy/

30 శాతానికి పైగా ఊబకాయం..

అలానే, ఒకే వయసులో పెళ్లైన జంటల్లో, లేదా సమాన విద్యార్హతలున్నవాళ్లలో కలిసిన జీవనశైలి కారణంగా, వీరిలో 30 శాతానికి పైగా ఊబకాయం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. తమ అభిరుచులు, అలవాట్లు ఒకేలా ఉండటం వల్ల తినే అలవాట్లూ, వ్యాయామం చేయకపోవడమూ అలవాటవుతుంది. కొంతమంది తమ కెరీర్‌, పిల్లల భవిష్యత్, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ లావుగా మారిపోతున్నారు.

బరువు పెరుగుదలకు..

వీటికి తోడు, ఫుడ్ డెలివరీ యాప్స్ పెరగడం,  ఎక్కువకాలరీలు ఉండే ఫాస్ట్ ఫుడ్స్, లేట్ నైట్ స్నాకింగ్ వంటి అలవాట్లు జంటల్లో బరువు పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.చాలా జంటలు ఉదయం వేళలకే నిద్రలేవడం లేదు, వ్యాయామానికి సమయం కేటాయించడం లేదు. కాఫీ, టీ, హైవోల్యూమ్ కార్బొహైడ్రేట్ ఫుడ్స్ తినడం, రెగ్యులర్‌గా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం లాంటి అలవాట్లు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.

ALSO READ: https://teluguprabha.net/lifestyle/black-sesame-helps-hair-regrowth-stops-hair-fall-naturally/

బిపి, మధుమేహం, గుండెజబ్బులు…

పలు అధ్యయనాల ప్రకారం, 30 ఏళ్ల వయస్సు గల కొత్తగా పెళ్లైన జంటల్లో లావు అవ్వడం మరింతగా పెరుగుతోంది. వీకెండ్ ఫన్, లేట్ నైట్ పార్టీలు, ఫన్ లవింగ్ లైఫ్ స్టైల్ అన్నీ కలిపి వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ తరహా జీవనశైలిలో బిపి, మధుమేహం, గుండెజబ్బులు వంటి సమస్యలు త్వరగా రావడం గమనార్హం.

భావోద్వేగ సంబంధం..

అనేకమంది నిపుణులు చెబుతున్న సంగతి ఏమిటంటే, ఈ అనారోగ్యకర అలవాట్లకు జంటల మధ్య ఉండే భావోద్వేగ సంబంధం కూడా ఒక కారణంగా మారుతోంది. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు ‘ఎమోషనల్ ఈటింగ్’ అనే అలవాటు పెరగడం ద్వారా ఫుడ్ కంట్రోల్ కోల్పోతున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు షుగర్ లేదా కార్బ్స్ ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది.

Also Read: https://teluguprabha.net/lifestyle/eating-these-fruits-will-help-you-lose-weight/

ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే మొదటగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మైండ్‌ఫుల్ ఈటింగ్ అలవాటు చేసుకోవాలి. ఇద్దరూ కలిసి వ్యాయామం చేయడమో, వాకింగ్‌కు వెళ్లడమో, సమతులాహారం తీసుకోవడమో చేయాలి. అలానే ఒక్కొక్కరి అవసరాల ప్రకారం పోర్షన్ కంట్రోల్ పాటిస్తూ తినాలి. మరీ ముఖ్యంగా అధికకాలరీలు ఉన్న జంక్ ఫుడ్, మిఠాయిలు, ఆల్కహాలిక్ పానీయాల వంటివి తగ్గించాలి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad