Dark Circles Remedies: ముఖానికి అందాన్నిచ్చే కళ్ళు కింద నల్లటి వలయాలు వస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. దీని సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి, పోషకాహార లోపం, లేదా వృధ్యాపం వంటి అనేక కారణాలు. అయితే, ఈ సమస్యకు మార్కెట్లో దొరికే రసాయన క్రీముల వాడటం కంటే ఇంట్లో సులభంగా లభించే సహజ పదార్థాలతో సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఈ సింపుల్ టిప్స్ క్రమం తప్పకుండా పాటిస్తే, కళ్ళు తిరిగి ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
దోసకాయ ముక్కలు
కళ్ళ కింద నల్లటి వలయాలను తొలగించడానికి దోసకాయ ఒక ప్రభావవంతమైన గృహ నివారణ. దోసకాయ హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. కావున చర్మాన్ని చల్లబరుస్తుంది. వాటిని గుండ్రంగా కోసి 10-15 నిమిషాలు కళ్ళపై ఉంచాలి. ఇలా రోజూ చేయడం ద్వారా నల్లటి వలయాలు తేలికవుతాయి.
బంగాళాదుంప రసం
బంగాళాదుంప నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది. పచ్చి బంగాళాదుంప రసాన్ని కళ్ళ కింద కాటన్‌తో అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇందులో ఉండే బ్లీచింగ్ లక్షణాలు నల్లటి వలయాలను తేలికపరచడంలో సహాయపడుతాయి.
Also read: Sleep: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..?అయితే వెంటనే వీటిని తినండి..
రోజ్ వాటర్
రోజ్ వాటర్ రెమెడీ ముఖాన్ని అందంగా మార్చుతుంది. నల్లటి వలయాలను తొలగిస్తుంది. రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్‌లను నానబెట్టి కళ్ళపై ఉంచాలి. ఇది కళ్ళకు విశ్రాంతినిస్తుంది. దీంతో నల్లటి వలయాలు తగ్గడం ప్రారంభిస్తుంది.
బాదం నూనె
బాదం నూనెలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఎంతో మంచిది. నల్లటి వలయాలను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ నివారణ కోసం, నిద్రపోయే ముందు కళ్ళ కింద తేలికగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ నివారణ క్రమంగా నల్లటి వలయాలను తగ్గిస్తుంది.
గ్రీన్ టీ బ్యాగులు
గ్రీన్ టీ బ్యాగుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు, నల్లటి వలయాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఉపయోగించిన టీ బ్యాగులను చల్లబరిచి కళ్ళపై ఉంచాలి. కొన్ని రోజులు ఈ ప్రయోగం కళ్ళ కింద నల్లటి వలయాలను తేలికపరుస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


