Banana Walnuts Lassi Making: దేశవ్యాప్తంగా భక్తులు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. భక్తులు ఉపవాసం ఉంటూ దుర్గాదేవిని పూజిస్తారు. అయితే, ఉపవాస సమయంలో తేలికైన, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం ఒక సంప్రదాయం. ఈ క్రమంలో అరటిపండు, వాల్‌నట్‌లతో తయారు చేసిన లస్సీ శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది కడుపు నింపే ఆరోగ్యకరమైన డ్రింక్ మాత్రమే కాదు, ఉపవాసం సమయంలో అలసట, బలహీనత, ఆకలిని కూడా తగ్గిస్తుంది.
అరటిపండు వాల్‌నట్‌లతో తయారు చేసిన ఈ లస్సీని తాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు. ఈ డ్రింక్ తయారీలో వాడే అరటిపండు సహజ చక్కెర, ఫైబర్ కలిగి ఉంటాయి. ఇక వాల్‌నట్‌లు మెదడు, గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తయారు చేసిన ఈ లస్సీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఈ లస్సి ని ఎలా రెడీ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
అరటిపండ్లు – 2
వాల్‌నట్‌లు – 6 నుండి 7
పెరుగు – 2 కప్పులు (తాజాగా, చల్లగా)
తేనె – 2 టీస్పూన్లు (తీపి కోసం)
యాలకుల పొడి – 1/4 టీస్పూన్
ఐస్ క్యూబ్స్ – సరిపడా
తయారీ విధానం:
1. శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచే అరటిపండు, వాల్‌నట్ లస్సీని తయారు చేయడానికి తాయారు చేయడానికి ముందుగా రెండు పండిన అరటిపండ్లను తీసుకోవాలి. వాటిని తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇలా చేస్తే వాటిని బ్లెండర్‌లో మిక్స్ చేయడం సులభం అవుతుంది.
2. అనంతరం మిక్సర్ జార్‌లో లో ముక్కలుగా కట్ చేసుకున్న అరటిపండ్లతో 6-7 వాల్‌నట్‌లు, 2 కప్పుల తాజా, చల్లబడిన పెరుగును తీసుకోవాలి. కావాలంటే రుచి కోసం 2 టీస్పూన్ల తేనె జోడించాలి. తేనె సహజ స్వీటెనర్‌గా పనిచేస్తుంది. అలాగే, పావు టీస్పూన్ ఏలకుల పొడిని కూడా జోడించాలి. ఇది లస్సీ రుచిని మరింత పెంచుతుంది.
3. అన్ని పదార్థాలను జోడించిన తర్వాత, మిక్సర్‌ను 2-3 నిమిషాలు బ్లెండ్ చేయాలి. మిశ్రమం నునుపుగా, క్రీమీగా మరెంత వరకు బ్లెండ్ చేయాలి. చల్లని లస్సీని ఇష్టపడితే కొన్ని ఐస్ క్యూబ్‌లను వేసి మళ్ళీ బ్లెండ్ చేయవచ్చు. దీంతో అరటిపండు వాల్‌నట్ లస్సీ రెడీ.


