Snakes Avoid: ప్రస్తుత వానాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మన ఇంట్లోని వంటగదిలో కొన్ని పదార్థాలు పాముల్ని ఆకర్షిస్తాయి. ఆ తినే పదార్థాల వాసన ద్వారా ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వాటిని పొరపాటున కూడా వంటింట్లో పెట్టుకుండా జాగ్రత్తలు వహించాలి. అవేంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాముల్ని చాలా మంది చూసి భయంతో పారిపోతారు. కొందరైతే వాటి పేరు వింటేనే హడలెత్తిపోతారు. ఇలాంటి వాళ్లు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. పాములు వాసన పసిగట్టే కొన్ని పదార్థాలు ఉంటాయి. వాటి కోసం ఇంట్లోని వంటగదిలో దూరిపోతాయి.
కొందరు కిచెన్ లలో బియ్యం బస్తాలు పెడుతుంటారు. పప్పులు కూడా పెడుతుంటారు. వీటి కోసం ఎలుకలు వస్తే.. వాటిని వెత్తుక్కుంటూ పాములు కూడా వస్తాయట. ఎలుకల వాసనలు పసిగట్టి పాములు సంచరిస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళలో ఇవి ఎక్కువగా తిరుగుతుంటాయి.
అదే విధంగా వంటగదిలో గుడ్లు, కోళ్లకు సంబంధించిన వాసనల వల్ల పాములు వస్తాయట. కోళ్ల ఫారాల వద్ద కూడా ఆ వాసనకు ఎక్కువగా పాములు సంచరిస్తాయట. అందుకోసం ఎప్పటికప్పుడు గుడ్లు లేదా ఇతర కోడి మాంసం వంటి వాటిని ఎప్పటికి అప్పుడు తెచ్చి వండుకోవడం ఉత్తమం. కోళ్లు వాటి గుడ్ల వాసనల్ని గ్రహించే శక్తి పాములకు ఉందట.
ఇదే విధంగా.. ఇంట్లో గోడలకు రంధ్రాలు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకొవాలి. ఇంటి చుట్టుపక్కల గుబురుగా పెరిగిన మొక్కలను తీసేసి శుభ్రం చేసుకోవాలి. వాడని వేస్ట్ వస్తువులలో పాములు ఎక్కువగా నివాసం ఉంటాయట.
ఇలా చేస్తే.. పాములు దరిచేరవు
పాముల బెడద తగ్గాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఎండు కారం నీళ్లలో కలిపి దాన్ని ఇంటి చుట్టు చల్లాలి. కర్పూరంను పొడిగా చేసి నీళ్లలో కలిపి ఆ నీటిని కూడా ఇంటి చుట్టూ చల్లితే పాములు రావు. కలరా ఉండలు ఇంటి చుట్టూ వేసినా వాసనకి పాములు దూరంగా పారిపోతాయి.


