Types of Tea: ఒక రోజు అన్నం లేకపోయినా ఉంటాం కానీ టీ లేకుండా ఉండలేం అంటారు కొంతమంది. టీ తాగని రోజంతా అసలు రోజులా ఉండదు అంటారు. రోజుకు కనీసం మూడు లేదా నాలుగు సార్లు టీ తాగే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా టీ అనేది ఒకప్పుడు మనం ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా ఇప్పుడు ఎన్నో రకాలుగా లభిస్తుంది. ప్రతి రకానికి వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు, రుచి, తయారీ విధానం ఉంటుంది. అందులో కొన్ని ముఖ్యమైన టీ రకాలను ఇప్పుడు చూద్దాం.
- గ్రీన్ టీ (Green Tea):
ప్రయోజనాలు: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గే వారికి చాలా ఉపయోగపడుతుంది.
రుచి: కొంచెం చేదుగా ఉంటుంది.
తయారీ: నీటిని మరిగించి, గ్రీన్ టీ లీవ్స్ వేసి 2-3 నిమిషాల పాటు ఉంచాలి.
- బ్లాక్ టీ (Black Tea):
ప్రయోజనాలు: హార్ట్ హెల్త్‌కు మంచిది, ఎనర్జీ ఇస్తుంది.
రుచి: మంచి రుచి కలిగి ఉంటుంది.
తయారీ: నీటిలో బ్లాక్ టీ పొడి వేసి మరిగించాలి.
- హెర్బల్ టీ (Herbal Tea):
ప్రయోజనాలు: చక్కటి నిద్రకు, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
రుచి: వివిధ మొక్కల రుచి ఆధారంగా మారుతుంది (తులసి, పుదీనా మొదలైన వాటి ఆకులతో చేస్తారు).
తయారీ: మొక్కల ఆకులు నీటిలో మరిగించాలి.
- ఊలాంగ్ టీ (Oolong Tea):
ప్రయోజనాలు: కొవ్వును కరిగించే లక్షణాలు కలిగి ఉంటుంది.
రుచి: గ్రీన్ టీ, బ్లాక్ టీ మద్య మిశ్రమ రుచి.
తయారీ: ఊలాంగ్ టీ ఆకులను వేడి నీటిలో ఉంచి వేడిగానే తాగాలి.
- మసాలా టీ (Masala Chai):
ప్రయోజనాలు: జీర్ణశక్తిని పెంచుతుంది, శరీరానికి వేడిని అందిస్తుంది.
కావలసినవి: పాలు, టీ పౌడర్, అల్లం, ఏలకులు, లవంగాలు, మిరియాలు.
తయారీ: అన్ని మసాలాలు వేసి పాలలో మరిగించి తయారుచేస్తారు.
- ఐస్ టీ (Ice Tea):
ప్రయోజనాలు: వేసవిలో శరీరాన్ని చల్లబరచుతుంది.
తయారీ: టీ తయారుచేసి చల్ల బెట్టి ఐస్ ముక్కలతో కలిపి తాగుతారు.
వీటితో పాటు మరికొన్ని టీ రకాలు:
లెమన్ టీ – జలుబు, గొంతు నొప్పికి మంచిది.
తులసి టీ – రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పుదీనా టీ – జీర్ణ సమస్యలకు చక్కటి పరిష్కారం.
అల్లం టీ – తలనొప్పిని తగ్గిస్తుంది.
అయితే ఏ టీ అయినా మితంగా తాగడం మేలైనది. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరిపోయే టీ ను మీరే ఎంచుకోండి.


