Monday, November 17, 2025
Homeలైఫ్ స్టైల్Blodd Pressure: అధిక రక్తపోటును నియంత్రించే సహజ చిట్కాలు..

Blodd Pressure: అధిక రక్తపోటును నియంత్రించే సహజ చిట్కాలు..

Natural tips to control high blood pressure: కొన్నిసార్లు అకస్మాత్తుగా తలనొప్పి, తలతిరుగుడు అనిపిస్తే తక్షణమే రక్తపోటును చెక్ చేసుకోవడం మంచిది. ఇవి అధిక రక్తపోటు లక్షణాలు కూడా కావొచ్చు. అధిక రక్తపోటుని నిశ్శబ్ద కిల్లర్ అని కూడా అంటారు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. కొన్నిసార్లు బీపీ లక్షణాలను గుర్తించలేము. దీంతో అధిక రక్తపోటు గుండె, మూత్రపిండాలు, కళ్ళు, మెదడుకు ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ రక్తపోటు రీడింగ్ 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకోవడం ఎంతో అవసరం. కొన్ని సార్లు అధిక రక్తపోటు ఉంటె, ఇంట్లో సమయానికి బీపీ మందులు ఉండవు. ఇటువంటి పరిస్థితిలో అధిక రక్తపోటును నియంత్రించడానికి కొన్ని సహజ పద్ధతులను కూడా అవలంబించవచ్చు. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

- Advertisement -

Also Read: Lemon Tea: సాధారణ టీ కంటే ఇది ఎంతో ఉత్తమం!

అధిక రక్తపోటును ఎలా నియంత్రించాలి?

బీపీ అకస్మాత్తుగా పెరిగి, రక్తపోటును నియంత్రించడానికి ఇంట్లో మందులు లేకపోతే ఈ సహజ పద్దతులను అనుసరించడం ద్వారా బీపీని తగ్గించవచ్చు.

1. మొదట తల, పాదాలపై చల్లటి నీరు పోయాలి.
2. లోతైన శ్వాస తీసుకొని 5-10 నిమిషాలు పాటు ధ్యానం చేయాలి.
3. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పు, కారంగా ఉండే ఆహారాలు తినకూడదు.
4. బీపీని నియంత్రించడానికి చక్కెర లేకుండా నిమ్మకాయ నీరు తాగాలి.
5. నల్ల తులసి లేదా వెల్లుల్లి రెబ్బను నమలాలి.
6. ఇంట్లో కొబ్బరి నీరు ఉంటే, దానిని చల్లబరిచి తాగాలి.
7. అధిక రక్తపోటు ఉంటే, దానిమ్మ రసం త్రాగండి.

అయితే, పై చర్యలను అనుసరించిన రక్తపోటు అదుపులో లేకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. మందులు బీపీని త్వరగా నియంత్రించడంలో సహాయపడతాయి.

 

Also Read: Egg Fried Rice Recipe: మిగిలిపోయిన అన్నంతో ఇలా “ఎగ్ ఫ్రైడ్ రైస్” చేసుకోండి..

అధిక రక్తపోటు లక్షణాలు:

1. తలలో బరువు లేదా నొప్పి
2. తల తిరగడం
3. దృష్టి మసకబారడం
4. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
5. ముక్కు రక్తస్రావం
6. ఛాతీ నొప్పి
7. అలసట లేదా అసౌకర్యం

అధిక బీపీ కారణాలు:

1. ఊబకాయం ఉండటం, వ్యాయామం చేయకపోవడం
2. అధిక ఉప్పు తీసుకోవడం
3. ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం
4. ధూమపానం, మద్యం సేవించడం
5. దీర్ఘకాలిక ఒత్తిడి లేదా ఆందోళన
6. నిద్ర లేకపోవడం
7. మధుమేహం
8. మూత్రపిండాల సమస్యలు

 

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad