Health Benefit Of Eating Walnuts: వాల్‌నట్స్ ఒక అద్భుతమైన డ్రై ఫ్రూట్. దీని ఎక్కువగా డెజర్ట్, కేక్, సలాడ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వాల్‌నట్స్ మెదడు ఆకారం ఉంటాయి. దీని బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. వాల్‌నట్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు మానసిక ఆరోగ్యానికి, రెగ్యులర్ హెల్త్‌కు ఎంతగానో సహాయపడుతుంది. వాల్‌నట్స్‌లో ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్ ఇ, బి6, బి9, ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, సెలీనియం పుష్కలంగా లభిస్తాయి.
వాల్ నట్స్ ఆరోగ్య ప్రయోజనాలు:
• వాల్‌నట్స్ మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇందులో ఒమేగా-3 అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. వాల్‌నట్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్‌లు మెదడు కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.
• గుండె ఆరోగ్యానికి కూడా వాల్‌నట్స్ మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3 గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా చేస్తుంది. కాబట్టి వాల్‌నట్స్‌ను మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం.
• ప్రతిరోజు ఒక గుప్పెడు వాల్‌నట్స్ తినడం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. వల్‌నట్స్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ ప్రేగులో ఉండే హానికరమైన బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణంతో బాధపడేవారు వాల్‌నట్స్‌ను డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
• అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా ఈ వాల్‌నట్స్‌ను తినవచ్చు. ఇది అతిగా తినకుండా నియంత్రిస్తుంది. అలాగే కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా వాల్‌నట్స్‌ను తినవచ్చు. ఇందులో రాగి, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది.
• డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు కూడా వాల్‌నట్స్‌ను తినవచ్చు. ఇది షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కూడా వాల్‌నట్స్‌ను తినవచ్చు. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటే నానబెట్టిన వాల్‌నట్స్‌ను తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ ఇ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
వాల్‌నట్స్‌ను అనేక రకాలుగా తినవచ్చు. వీటిని రాత్రి పూట నానబెట్టి తినడం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. వాల్ నట్స్ ను స్నాక్ గా తీసుకోవచ్చు.