Bathing Vs Chappals: మన దైనందిన జీవితంలో చేసే చిన్నచిన్న పనులు మన ఇంటి వాతావరణంపై, మన అదృష్టంపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఉదయం స్నానం చేయడం శరీర శుభ్రతకే కాకుండా మనసుకు ప్రశాంతతనూ ఇస్తుంది. అయితే స్నానం తర్వాత మనం అలవాటుగా చేసే కొన్ని పనులు వాస్తు నియమాల ప్రకారం అనుకూలం కావని నిపుణులు చెబుతున్నారు. అలాంటి తప్పులు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో వాదోపవాదాలు, అనవసరమైన అశాంతికి కారణమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.
మిగిలిన నీటిని..
సాధారణంగా స్నానం చేసిన తర్వాత బకెట్‌లో మిగిలిన నీటిని అలాగే వదిలేయడం చాలామందిలో కనిపించే అలవాటు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది అనుకూలం కాదు. మిగిలిన నీటిని అలాగే ఉంచడం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని, ముఖ్యంగా రాహువు, కేతువు ప్రభావం పెరుగుతుందని అంటున్నారు. దాంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, విభేదాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల స్నానం అయ్యాక బకెట్‌ను ఖాళీ చేసి బోర్లించి ఉంచాలని సూచిస్తున్నారు.
వస్తువులను చిందరవందరగా..
ఇంకో సాధారణ తప్పు బాత్రూమ్‌లో వస్తువులను చిందరవందరగా వదిలేయడం. సబ్బులు, షాంపూలు, బ్రష్‌లు ఇలా వాడిన వస్తువులను నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని హెచ్చరిస్తున్నారు. వస్తువులను వాటి స్థానంలో ఉంచడం, బాత్రూమ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని అంటున్నారు.
ట్యాప్‌ను ఓపెన్‌గా..
స్నానం తర్వాత ట్యాప్‌ను ఓపెన్‌గా వదిలేయడం కూడా మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల నీరు వృథా అవ్వడమే కాకుండా, దానికి తగినంతగా డబ్బు కూడా వృథా అవుతుందని నమ్మకం ఉంది. నీటిని వృథా చేయడం ఆర్థిక ఇబ్బందులను పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఎల్లప్పుడూ పొడిగా..
వాస్తు ప్రకారం పరిశుభ్రత చాలా ముఖ్యం. బాత్రూమ్ ఎల్లప్పుడూ పొడిగా ఉండాలి. నిలిచిపోయిన నీరు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని, అది ఇంట్లో వాతావరణాన్ని చెడగొడుతుందని చెబుతున్నారు. అదే విధంగా స్నానం చేసినప్పుడు రాలిన జుట్టును అక్కడే వదిలేయడం కూడా మంచిది కాదు. అలా చేయడం ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని కలిగిస్తుందని నమ్మకం ఉంది. అందువల్ల రాలిన వెంట్రుకలను వెంటనే శుభ్రం చేయాలని సలహా ఇస్తున్నారు.
చెప్పులు వేసుకుని..
చెప్పులు వేసుకుని స్నానం చేయడం కూడా వాస్తు నియమాల ప్రకారం సరైనది కాదు. ఇలా చేయడం వల్ల నీరు అపవిత్రమవుతుందని, అది శుభకార్యాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని అంటున్నారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/vastu-rules-warn-against-black-kitchen-slabs/
ఇక వివాహిత మహిళలకు ప్రత్యేక సూచనలు ఉన్నాయి. స్నానం తర్వాత వెంటనే తడి జుట్టుతో సింధూరం పెట్టుకోవడం అశుభంగా పరిగణిస్తారు. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే సింధూరం ధరించాలి అని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్నానం చేసిన తర్వాత తడి బట్టలను బాత్రూమ్‌లో వదిలేయడం మంచిది కాదని వాస్తు సూచిస్తోంది. అలా చేయడం వల్ల రాహువు, కేతువు ప్రభావం పెరిగి కుటుంబ సభ్యుల జీవితాలపై ప్రతికూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.


