Friday, April 25, 2025
Homeలైఫ్ స్టైల్Watermelon: భోజనం తర్వాత పుచ్చకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?

Watermelon: భోజనం తర్వాత పుచ్చకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?

వేసవి రాగానే మనకి గుర్తొచ్చే పండు పుచ్చకాయ. తినడానికి తీపిగా ఉండే ఈ పండు.. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే ఇది వేసవిలో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఇందులో 90 శాతం నీరు ఉండటం వల్ల, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకుంటుంది. వేసవిలో ఎక్కువ వేడి వల్ల వచ్చే తల నొప్పి, బలహీనత వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. అయితే పుచ్చకాయను ఎప్పుడు తినాలి అనే విషయంలో చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనానికి సుమారు గంట ముందు తింటే, అది జీర్ణవ్యవస్థకు ఉపయోగపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత పుచ్చకాయ తింటే శరీరానికి మళ్లీ నీరు, శక్తి అందుతుంది. మధ్యాహ్నం వేళ తింటే శరీర ఉష్ణోగ్రత తగ్గి చల్లగా అనిపిస్తుంది.

- Advertisement -

అయితే పుచ్చకాయను ఎప్పుడూ భోజనం తర్వాత తినకూడదు. ఎందుకంటే ఇది గ్యాస్, అసిడిటీ, జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. అలాగే రాత్రిపూట తింటే, ఎక్కువ నీరు ఉండడం వల్ల రాత్రంతా తరచూ మలబాత్‌కి వెళ్లాల్సి వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం పుచ్చకాయ తింటే మంచిదంట. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది, ఆకలి నియంత్రణలో ఉంటుంది.

ఇక పుచ్చకాయను ఇతర వేడి స్వభావం కలిగిన పండ్లతో కలిపి తినకూడదు. ఇది జీర్ణానికి ఇబ్బంది కలిగించొచ్చు. ముఖ్యంగా అరటిపండు, నారింజ, ద్రాక్ష లాంటి పండ్లతో కలిపి తినకూడదు. వాటి కలయిక వల్ల జలుబు, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక ఫ్రిజ్‌ నుంచి వెంటనే తీసిన పుచ్చకాయను తినకూడదు. ఎందుకంటే అది గొంతు నొప్పి, జీర్ణ సమస్యలు కలిగించవచ్చు. కొంచెం వేడి రాగానే తింటే మంచిది. వేసవిలో రోజూ కొద్దొ కొద్దిగా పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News