Friday, April 18, 2025
Homeలైఫ్ స్టైల్ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.. అసలు కారణం ఇదే..!

ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.. అసలు కారణం ఇదే..!

ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలో రోజు టైమ్ గడుపుతున్నారు. పెద్దలే కాదు, చిన్నపిల్లలు కూడా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లాంటి ప్లాట్‌ఫార్మ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.
ఈ ప్లాట్‌ఫార్మ్‌లలో ఫోటోలు, వీడియోలు షేర్ చేయడమే కాకుండా… ఎక్కువగా ఎమోజీలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఈ ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయని ఆలోచించారా.. దీని వెనుక ఉన్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ఎమోజీలు అంటే మన భావాలను చూపించేందుకు ఉపయోగించే చిన్న ముఖాలే. మొట్టమొదటగా పసుపు రంగుతో ఉన్న స్మైలీ ఫేస్ 1960లలో తయారు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రంగు కొనసాగుతోంది. అయితే ఇలా అదే రంగులో కొనసాగించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పసుపు రంగు చూస్తే మనకో మంచి ఫీల్ వస్తుంది. ఇది సంతోషాన్ని, ఉత్సాహాన్ని సూచించే రంగు. అందుకే ఎమోజీల్లో ఈ రంగును ఎక్కువగా వాడుతారు.

ఇక ఎమోజీలు అన్ని వయసుల వారికి అర్థమయ్యేలా ఉండాలి. పసుపు రంగు న్యూట్రల్‌గా ఉంటుంది. ఇది ఎవరినీ ప్రత్యేకంగా చూపదు. అందుకే ఈ రంగు సెలెక్ట్ చేశారు. ఎమోజీలు మన ముఖ భావాలను చూపించాలి కానీ, నేరుగా చర్మం రంగును సూచించకూడదు. అందుకే పసుపు రంగు ఎంపిక చేశారు.. ఇది నిజానికి ఎవరి స్కిన్ టోన్‌కి డైరెక్ట్‌గా సరిగ్గా సంబంధం లేని రంగు. ఇక పసుపు రంగు స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ స్క్రీన్‌లపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనుక అన్ని డివైస్‌లలో ఎమోజీలు చక్కగా కనిపించేందుకు ఇదే రంగు ఉపయోగిస్తున్నారు.

ఎమోజీలు చిన్నవైనా మన భావాలను పెద్దగా చెప్పగలిగే పటాలు. అవి ఎలాంటి మాటలు లేకుండానే మన భావోద్వేగాలను వ్యక్తపరిచే సాధనాలుగా మారిపోయాయి. ఇకపై మీరు ఏదైనా పసుపు రంగు స్మైలీ ఉపయోగించినప్పుడు.. దాని వెనుక ఉన్న చిన్న కథను గుర్తు చేసుకోండి. స్మైల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News