Sunday, November 16, 2025
Homeనేషనల్Roof Collapse: జమ్మూ కాశ్మీర్‌లో ఇల్లు కూలి 30 మంది మహిళలకు గాయాలు

Roof Collapse: జమ్మూ కాశ్మీర్‌లో ఇల్లు కూలి 30 మంది మహిళలకు గాయాలు

30 Women Injured As Roof Collapses: జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఓ ఇంట్లో మతపరమైన ప్రవచనాలకు హాజరైన దాదాపు 30 మంది మహిళలకు గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం ఓ నివాస గృహం పైకప్పు కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

ALSO READ: Noida:చంపేసి ఎన్ని నాటకాలు ఆడారు..కుమారుడు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి..!

అధికారుల కథనం ప్రకారం, పోహ్రుపేఠ్ గ్రామంలోని ఒక ప్రబోధకుడి ఇంట్లో ఒక హాలులో మహిళలు మతపరమైన ప్రవచనాల కోసం సమావేశమయ్యారు. ఉన్నట్టుండి పైకప్పు కూలిపోవడంతో అక్కడున్న కొంతమందికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గాయపడిన వారిని హంద్వారాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలు.. ఒకరు గల్లంతు

“సుమారు 30 మంది గాయపడిన మహిళలు మా ఆసుపత్రికి వచ్చారు. అదృష్టవశాత్తూ, అందరి పరిస్థితి నిలకడగా ఉంది,” అని ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ ఐజాజ్ అహ్మద్ తెలిపారు. “వైద్యులు అందరినీ పరీక్షించి పర్యవేక్షిస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు,” అని ఆయన అన్నారు.

ALSO READ: PM Modi : గుజరాత్ లో రెండు రోజు పాటు ప్రధాని మోదీ పర్యటన .. రూ. 5,400 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad