Friday, November 22, 2024
Homeనేషనల్MLA Gulab Singh Yadav : సొంత పార్టీ ఎమ్మెల్యేనే కొట్టిన కార్య‌క‌ర్త‌లు.. వీడియో వైర‌ల్

MLA Gulab Singh Yadav : సొంత పార్టీ ఎమ్మెల్యేనే కొట్టిన కార్య‌క‌ర్త‌లు.. వీడియో వైర‌ల్

MLA Gulab Singh Yadav : ఆప్ ఎమ్మెల్యేను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే త‌రిమి త‌రిమి కొట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గామారింది. దీనిపై ప్ర‌త్య‌ర్థి పార్టీ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగింది.

- Advertisement -

ఢిల్లీలోని మటియాలా శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఆప్ ఎమ్మెల్యే గులాబ్‌సింగ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 4న మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో సోమ‌వారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో పార్టీ ఆఫీసులో కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అక్క‌డ టికెట్ల‌కు సంబంధించి ఎమ్మెల్యేకు కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్ర‌హానికి లోనైన కార్య‌క‌ర్త‌లు ఎమ్మెల్యేపై దాడికి దిగారు. పార్టీ ఆఫీసు నుంచి ఆయ‌న్ను త‌రిమి త‌రిమి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన టికెట్ల‌ను ఎమ్మెల్యే గులాబ్ సింగ్ అమ్ముకుంటున్న‌ట్లు బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అందుకే కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌పై దాడి చేశార‌ని అంటున్నారు. అయితే.. ఈ ఆరోప‌ణ‌ల‌పై ఎమ్మెల్యే గులాబ్‌సింగ్ స్పందించారు. బీజేపీ త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తోంద‌న్నారు. ఈ దాడి వెనుక బీజేపీ పార్టీ నేత‌ల హ‌స్తం ఉండొచ్చున‌నే అనుమానాల‌ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News