Monday, April 7, 2025
Homeచిత్ర ప్రభActress Kasturi: పరారీలో నటి కస్తూరి.. హైకోర్టులో బెయిల్ పిటిషన్

Actress Kasturi: పరారీలో నటి కస్తూరి.. హైకోర్టులో బెయిల్ పిటిషన్

Actress Kasturi| సీనియర్ నటి, బీజేపీ మహిళా నేత కస్తూరి తమిళనాడు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయకుండా మందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పినా.. ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు నమోదు చేశారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

- Advertisement -

కాగా ఇటీవల బ్రహ్మణుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కస్తూరి.. తెలుగు జాతి ప్రజలపై వివాదాస్పదనమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై తెలుగు సంఘాలతో పాటు తమిళ సంఘాలు కూడా చెన్నై, మధురై సహా వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుచేశాయి. దీంతో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో కస్తూరి నాలుగు రోజులుగా పరారీలో ఉన్నారు. ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దాంతో ఆమె ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఇక చేసేదేమీ లేక హైకోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News