తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేయడానికి ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ప్రచార రథాలు కదిలాయి. ఈ నెల 24వ తేదీన ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్)లోని జబిందా మైదానంలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతానికి పెద్ద ఎత్తున చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రచార రథాలను పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రారంభించారు.
అలాగే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాహారం తెలంగాణ మోడల్ ను వివరించే వాల్ పోస్టర్లను కూడా జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు.