Monday, January 20, 2025
Homeనేషనల్Saif: సైఫ్ అలీఖాన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కి రివార్డ్.. ఎంతంటే..?

Saif: సైఫ్ అలీఖాన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కి రివార్డ్.. ఎంతంటే..?

బాలీవుడ్ నటుడు.. సైఫ్ అలీఖాన్ పై జనవరి 16వ తేదీన.. ఉదయం దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించి పని మనిషితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో
సైఫ్ అలీఖాన్ పై నిందితులు కత్తితో దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి సైఫ్‌ను కత్తితో ఆరుసార్లు పొడిచాడని, దాని కారణంగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడి చేసిన వ్యక్తి పారిపోయిన తర్వాత, సైఫ్ స్వయంగా.. ఆటోలో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి వెళ్లాడు. నటుడి వెన్నెముకకు సమీపంలో కత్తి ముక్క ఇరుక్కుపోయింది.. దానిని లీలావతి ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.

- Advertisement -

అయితే సైఫ్ అలీఖాన్ ప్రాణాలను కాపాడంతో ఓ ఆటో డ్రైవర్ కీలక పాత్ర పోషించాడు. నిజానికి సైఫ్ ఇంగ్లో లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్‌కి ఓ ఆటో సాయంగా వచ్చింది. ఆ రాత్రి సైఫ్ రక్తపు మడుగులో పడి ఉండగా, అతని సహాయకుడు ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం కోసం పిలిచాడు. అక్కడే ఉన్న భజన్ సింగ్ అనే ఆటో డ్రైవర్ సైఫ్‌ను సేఫ్ గా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. తెల్లటి బట్టలతో, రక్తంతో నిండిన వ్యక్తి రావడం చూసిన భజన్ సింగ్‌కి ఆ వ్యక్తి సైఫ్ అలీఖాన్ అని కూడా తెలియదట.

అంతేకాదు తాను వారి వద్ద ఛార్జీ కూడా తీసుకోలేదని తెలిపాడు సదరు ఆటో డ్రైవర్. ఆ సమయంలో నేను అతడికి సాయం చేయగలిగినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆటో డ్రైవర్ రాణా చెప్పారు. ఆస్పత్రికి వెళ్లే క్రమంలో హోలీ ఫ్యామిలీకి లేదా లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలా అని ప్రశ్నించానని, వారు లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత మాత్రమే ఆయన సైఫ్ అలీ ఖాన్ అని తెలిసినట్లు చెప్పారు.

ఇక సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించిన ఆటో డ్రైవర్‌కు ఇప్పుడు రివార్డు లభించింది. సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లిన డ్రైవర్‌కు రూ.11,000 రివార్డు అందించారు. డ్రైవరు చేసిన సేవకు ఓ సంస్థ రివార్డ్‌ను అందజేసి అభినందించింది.

ఇక సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడు పశ్చిమ బెంగాల్‌ వాసి అని చెబుతున్నా, బంగ్లాదేశ్ వాసి అయి ఉండవచ్చని ఇప్పుడు పోలీసులు చెబుతున్నారు. నిందితుడి నుంచి ఎలాంటి గుర్తింపు కార్డు లభించలేదు. నిందితుడి నుంచి సరైన భారతీయ పత్రం ఏదీ లభించలేదని డీసీపీ దీక్షిత్ గెడం తెలిపారు. దీంతో పోలీసులు అతడిపై పాస్‌పోర్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News