లక్షలాది జనసందోహం మధ్య శబరిమలలో మకర జ్యోతి దర్శనం జరిగింది. జ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తులు తరించారు. శబరిమల గిరుల్లో స్వామియే శరణం అయ్యప్ప అన్న నామస్మరణతో హోరెత్తింది. ప్రతి ఏడు జనవరి 14వ తేదీ సాయంత్రం మూడు సార్లు మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. కరోనా కారణంగా దర్శనానికి రాని భక్తులు ఈ ఏడాది పోటెత్తడంతో శబరి గిరుల్లో ఈ ఏడాది భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. పొన్నాంబళంలోని స్వామి దర్శనానికి అయ్యప్ప మాలాదీక్షితులు, ఇతర భక్తులు రావటంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సి వస్తోంది. వణికిస్తున్న చలికి సైతం లెక్కచేయకుండా అయ్యప్ప భక్తులు ఇక్కడికి ఇంకా తరలివస్తుండటం విశేషం.