Saturday, November 23, 2024
Homeనేషనల్Bangalore: కర్నాటకలో మాస్క్ కంపల్సరీ

Bangalore: కర్నాటకలో మాస్క్ కంపల్సరీ

H3N2 వైరస్ కర్నాటకలో విశ్వరూపం చూపుతోంది. శరవేగంగా వ్యాపిస్తున్న ఈ వేరియెంట్ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు మాస్కును తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బెంగళూరు నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి సంఖ్య ఉన్నట్టుండి ఎక్కువ అవుతోంది. హోలీ పండుగ సెలబ్రేషన్స్ కూడా నడుస్తున్న నేపథ్యంలో మాస్కును మస్టు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అకారణంగా గుంపులు గుంపులుగా చేరవద్దని ప్రజలకు హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఇన్ఫ్లూయెన్జాను కట్టడి చేసేందుకు ప్రజలు చొరవ తీసుకుని సురక్షితంగా ఉండాలని బొమ్మై సర్కారు ప్రకటనలు ఇస్తోంది.
ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది యావత్తూ మాస్కులు ధరించాలని కూడా ఆదేశించారు. ఇన్ఫ్లూయెన్జా ఏ వైరస్ పరీక్షలు చేసేందుకు కోవిడ్ టెస్టు చేయించుకోవాలని చెబుతోంది. H3N2 కూడా కరోనా వైరస్ ను పోలినదే కావటంతో ఈమాత్రం కఠిన ఆంక్షలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News