Saturday, July 27, 2024
Homeనేషనల్Bharat Ratna to 5 members: ఏటా 3 మాత్రమే కానీ ఈసారి...

Bharat Ratna to 5 members: ఏటా 3 మాత్రమే కానీ ఈసారి 5 భారత రత్నలు

అత్యున్నత పౌర పురస్కారంతో మోడీకి ఫుల్ మైలేజ్

ఏడాదికి అత్యధికంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న అవార్డులు ఇచ్చే సంప్రదాయం ఇప్పటి వరకు ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా అయిదుగురికి భారత రత్న ప్రకటించటం విశేషం. ఇప్పటికే బిహార్ మాజీ సీఎం, ఓబీసీ ఉద్యమ యోధుడు కర్పూరి ఠాకూర్, బీజేపీ అగ్రనేత లాల్ కిషన్ అద్వానికి భారత రత్న అవార్డు ప్రకటించారు.

- Advertisement -

తాజాగా ఈరోజు ఏకంగా మరో ముగ్గురికి భారత రత్న అవార్డు ఇస్తున్నట్టు మోడీ చేసిన ట్వీట్ విశేషమైన వార్తగా ప్రజలు దేశవ్యాప్తంగా చెప్పుకునేలా చేసింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహా రావు, చౌదరి చరణ్ సింగ్ లతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న ప్రకటిస్తూ మోడీ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయి అందరి మన్ననలు చూరగొంది.

తెలుగు తేజంగా పేరొందరిన మాజీ ప్రధాని పీవీకి భారత రత్న ఇవ్వాలన్నది ఎప్పటి నుంచో తెలుగుజాతికి ఉన్న కోరిక కాగా ఇప్పుడు మోడీ సర్కారు తెలుగు వారి మనసెరిగి భారత రత్న ప్రకటించటం హైలైట్. ఇక వ్యవసాయానికి తాము అగ్ర తాంబూలం ఇస్తున్న విషయాన్ని నొక్కి చెప్పేందుకే అన్నట్టు రైతు ఉద్యమ నేతగా పాపులర్ అయిన చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటించారు. ఇలా చౌదరి చరణ్ సింగ్ కు అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వటం ద్వారా రైతుల పక్షపాతిగా, జాట్ సామాజిక పక్షపాతిగా రెండు వైపులా మోడీ సర్కారుకు మైలేజీ రావటం ఖాయంగా మారింది.

గ్రీన్ రెవల్యూషన్ పితామహుడిగా పేరుగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు అవార్డు ఇస్తున్నారు. స్వామినాథన్ కు అవార్డు రావటం రైతులకే కాదు ఇటు తమిళులకు చాలా ఆనందాన్ని ఇస్తుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన పాయింట్. తమిళ ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకోవటంలో బీజేపీ, మోడీ సర్కారు చేస్తున్న కృషికి ఇదో మచ్చుతునకగా మారింది.

ఓబీసీ ఓటర్లకు (దక్షిణాదిలో బీసీలు అంటారు) గాలం వేసేందుకు బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారత రత్న ప్రకటించటం గేమ్ ఛేంజర్ వ్యూహంగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండగా ఇలా భారత రత్న అవార్డులు ప్రకటించటం అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News