Sunday, November 16, 2025
Homeనేషనల్Free Scheme: ఎన్నికల వేళ నీతీశ్ మరో ఉచిత బాణం... కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు!

Free Scheme: ఎన్నికల వేళ నీతీశ్ మరో ఉచిత బాణం… కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు!

Bihar Free Electricity Scheme: బిహార్‌లో ఎన్నికల నగారా మోగకముందే హామీల వర్షం కురుస్తోంది. అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకునేందుకు ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మహిళలు, యువతను ఆకట్టుకునేలా పలు కీలక ప్రకటనలు చేసిన ఆయన, తాజాగా సామాన్యుడిపై మరో ‘ఉచిత’ వరాన్ని ప్రకటించారు. ఇకపై నెలనెలా కరెంట్ బిల్లు కట్టే బాధ ఉండదంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆగస్టు 1 నుంచి 125 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. 

- Advertisement -

ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ‘ఎక్స్’ వేదికగా ఈ కీలక ప్రకటన:

125 యూనిట్ల ఉచిత విద్యుత్: ఆగస్టు 1, 2025 నుంచి బిహార్  రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 125 యూనిట్ల  విద్యుత్ వినియోగంపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. అంటే, జూలై నెలలో వాడిన కరెంట్‌కు కూడా బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 1.67 కోట్ల కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది.

ఇంటింటికీ సోలార్ ప్లాంట్లు:

రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటిపై, యజమాని సమ్మతితో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పేదలకు పూర్తి ఉచితం:

“కుటిర్ జ్యోతి” పథకం కింద అత్యంత నిరుపేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్లను పూర్తి ఉచితంగా, ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేస్తారు.  వారికి అందుబాటు ధరల్లోనే వీటిని అందిస్తారు.

10,000 మెగావాట్ల లక్ష్యం:

ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఇవి మాత్రమే కాదు.. మరిన్ని హామీలు:

నీతీశ్ కుమార్ ప్రభుత్వం కేవలం ఉచిత విద్యుత్‌కే పరిమితం కాలేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వరుసగా పలు హామీలను ప్రకటిస్తోంది.

ఉద్యోగాల భర్తీ:

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మహిళలకు 35% రిజర్వేషన్:

తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, బిహార్‌లో శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి విభాగంలో 35% రిజర్వేషన్ కల్పిస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు.

కోటి ఉద్యోగాలు:

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో కోటి ఉద్యోగాలు సృష్టించడమే తమ లక్ష్యమని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ స్పష్టం చేశారు. బిహార్ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ హామీలు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి అని నిపుణులు పేర్కొంటున్నారు. 


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad