Sunday, October 6, 2024
Homeనేషనల్BJY: భారత్ జోడో యాత్ర కుదింపు

BJY: భారత్ జోడో యాత్ర కుదింపు

భద్రతా కారణాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ పార్టీ కుదించేలా కనిపిస్తోంది. జమ్మూ-కశ్మీర్ లో రాహుల్ పాదయాత్రలోకి ఎవరో అనామక వ్యక్తులు సడన్ గా వచ్చి చేరుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాహుల్ ను కలిసేందుకు ఓ వ్యక్తి ఉన్నట్టుండి దూసుకు రావటం కూడా భద్రతా లోపాలను ఎత్తి చూపింది. అసలు రాహుల్ గాంధీ సెక్యూరిటీ ప్రోటోకాల్ ను ఖాతరు చేయటం లేదని ఇప్పటికే సెక్యూరిటీ వివరణ సైతం ఇచ్చింది..ఈనేపథ్యంలో అనంత్ నాగ్ లోకి పాదయాత్ర చేరుకోగానే పాదయాత్రలా కాకుండా వాహనాల్లో ప్రయాణించేలా ఏర్పాటు సాగుతున్నాయి. పాదయాత్ర రూట్ మ్యాప్ లో కూడా మార్పులు జరిగే అవకాశాలున్నాయి. రోజుకు 25 కిలోమీటర్ల మేర కాకుండా తక్కువ దూరం వరకు మాత్రమే యాత్ర సాగే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శ్రీనగర్ లో లాల్ చౌక్ లో భారత జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా రద్దైంది. మరో చోట రాహుల్ జెండా ఆవిష్కరించే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News