భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభమయ్యే రాహుల్ పాదయాత్ర భారత్ జోడో యాత్రకు తాను హాజరు కావటం లేదని రాకేష్ టికాయత్ స్పష్టంచేశారు. కానీ భారతీయ కిసాన్ యూనియన్ వర్కర్లకు ఆసక్తి ఉంటే రాహుల్ యాత్రలో పాల్గొనవచ్చని ఆయన వెల్లడించటం విశేషం. జిల్లా అధ్యక్షులు, ఆపై ర్యాంక్ ఉన్న ఆఫీసు బేరర్లు ఎవరూ ఈ యాత్రలో పాల్గొనరని టికాయత్ వివరించారు. తమది పార్టీలకు అతీతంగా పనిచేసే సంస్థ అని, కాంగ్రెస్ పార్టీ విధానాలు బాగాలేకపోయినా తాము ఉద్యమిస్తామని ఇప్పటికే ఛత్తీస్ గఢ్ లో తమ సంస్థ ఉద్యమం చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. రాహుల్ యాత్రకు రావాల్సిందిగా ఆహ్వానం వచ్చిందా అన్ని ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. తనకు ఈమేరకు ఆహ్వానం అందిందని, వారితో వ్యవసాయ చట్టాలు, విధానాలపై చర్చిస్తానన్నారు.
BJY: షాక్ లో కాంగ్రెస్, రాహుల్ జోడో యాత్రకు రానని తెగేసి చెప్పిన టికాయత్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES