బ్రహ్మాస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ న్యావీ దీన్ని సంయుక్తంగా టెస్ట్ ఫైర్ చేశారు. ఈమేరకు డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), హిందూస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), బ్రహ్మాస్ ఎయిరోస్పేస్ (BAPL) ప్రకటన విడుదల చేశారు. సుఖోయ్ ఫైటర్ జెట్ల నుంచి వీటిని ప్రయోగించారు. బ్రహ్మాస్ మిస్సైల్ ఎక్స్ట్ టెండెట్ రేంజ్ సముద్రంలో 400 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. దీంతో సూపర్ సానిక్ క్రూజ్ మిస్సైల్ తన లక్ష్యాన్ని చేరుక్కున్నట్టైంది. ఇండియా-రష్యా సంయుక్తంగా బ్రహ్మాస్ ను డెవలప్ చేశాయి. దీంతో రక్షణ రంగంలో మనదేశం మరో మైలురాయిని అధిగమించినట్టైంది. బ్రహ్మాస్ క్షిపణుల సామర్థ్యం పెంచేందుకు దేశీయంగానే డీఆర్డీవో ప్రయోగాలు చేసి, విజయం సాధించటం హైలైట్.
BrahMos Missile: విజయవంతంగా బ్రహ్మాస్ మిస్సైల్ టెస్ట్ ఫైర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES