Friday, September 20, 2024
Homeనేషనల్BRS Maharashtra: బీఆర్ఎస్ లోకి వలస వస్తున్న మహారాష్ట్ర లీడర్స్

BRS Maharashtra: బీఆర్ఎస్ లోకి వలస వస్తున్న మహారాష్ట్ర లీడర్స్

తెలంగాణలో రైతు సర్కార్ అధికారంలోకి వచ్చిన కారణంగానే తొమ్మిదేండ్ల అనతి కాలంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన, దేశానికి ఆదర్శవంతమైన, తెలంగాణ మోడల్ పాలన అందుబాటులోకి వచ్చిందని… తాను స్వయంగా రైతు బిడ్డను కావడం వలనే ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మెట్టమొదటి సారి వినిపిస్తోందని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
బిఆరెఎస్ పార్టీ విధానాలు సిఎం కేసీఆర్ పాలన కు ఆకర్షితులై మహారాష్ట్ర నుంచి పలు వర్గాలకు చెందిన ప్రముఖుల చేరికలు కొనసాగుతూనే వున్నాయి. బుధవారం నాడు కూడా పలువురు ప్రముఖులు బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా.. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విశ్రాంత ఐపిఎస్ అధికారి, మహారాష్ట్ర ఐజీగా పనిచేసిన విఠల్ జాదవ్ బిఆర్ఎస్ లో చేరారు. వీరితో పాటు మహారాష్ట్ర సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రఖ్యాత డాన్సర్ సురేఖ పునేకర్ బిఆర్ఎస్ లో చేరారు. దాంతో..వీరి చేరిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇంకా…సామాజిక కార్యకర్త శేఖర్ అంబేకార్, ఉమాకాంత్ మంగ్రూలే తో పాటు లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ లు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు , బిజెపి కి చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు. వీరికి అధినేత కేసీఆర్ గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -


ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ… తమ జీవితాలు బాగుపడాంటే, తమ హక్కులు సాధించుకోవాలంటే పోరాటం మరోమార్గం లేనట్టుగా, తమ జీవితకాలం రోడ్ల మీద ఆందోళనలు చేయడానికే భారత దేశ రైతు పుట్టినట్టుగా దేశంలో పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనుంచి దేశంలో రైతు తన వ్యవసాయ పనులను వదులుకోని ఆందోళనలతో రోడ్లెక్కి పోరాటాలు చేయాల్సిన అవసరం రాకుండా వుండేలా తమ ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేసుకోవాలని సిఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘మన వోటు మనకే’ అనే చైతన్యంతో ‘ అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని నిజం చేసేందుకు దేశ రైతాంగమంతా బిఆర్ఎస్ పార్టీతో కలిసి నడవాలని పునరుద్ఘాటించారు. తప్పుడు ధోరణులను అనుసరిస్తున్న దేశ రాజకీయ ధోరణుల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరమున్నదని సిఎం అన్నారు. రాజకీయ పార్టీలు మూసధోరణుకుల భిన్నంగా ఆలోచన చేసిన్నాడే ( తింక్ అవుటాఫ్ ద బాక్స్) ఈ దేశంలో గుణాత్మక అభివృద్ధి సాధ్యమన్నారు. దేశ ప్రజలు మార్పును ప్రగాఢంగా కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.


‘‘ ఈ దేశం వ్యవసాయాధారిత దేశం. ఈ దేశంలో 42 శాతం రైతులున్నరు. మన వోట్లు మనమే వేసుకుంటే మన ప్రభుత్వమే ఏర్పాటయితది. ఈ దేశ రైతు ఎందుకు ఇతర పార్టీలకు వోట్లేసి మన కష్టాలు తీర్చమంటే వారెందుకు తీరుస్తరు..? కాంగ్రేస్ ను దింపి బిజెపిని గద్దెనెక్కిస్తుంటిమి. ఈ పార్టీ పోతే ఆ పార్టీ. దీంతో దేశ రైతాంగం ఏం సాధిస్తున్నది..? రైతులకేం మేలు జరుగుతున్నది..? మందికి వోటేసి మన కష్టాలు తీరమంటే తీరుతయా..? మన కష్టాలు మనమే తీర్చుకోవాలె..మన సమస్యలకు మనమే పరిష్కార మార్గాలు చూసుకోవాలె. అందుకు ఈ దేశ రైతాంగం చేయవలసిందొక్కటే… తామే ఎన్నికల బరిలోకి దిగి తమ కిసాన్ ప్రభుత్వాన్ని తామే ఎన్నుకోవాలె. రైతుల కష్టాలు తీరాలంటే ఇదొక్కటే మార్గం’’ అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మనుషులను కాదు దేశ పరిస్థితులను మార్చాలె’ ( ఆద్మీ కో నహీ దేశ్ కా హాలత్ కో బదల్నాహై) అని వివరించారు.


సమాజికంగా వెనకబడేసిన దళితులనుండి ఆర్థికంగా వెనకబడిన బ్రాహ్మణుల దాకా తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని సిఎం తెలిపారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ పాలన తెస్తే దివాళా తీస్తామని ఆ రాష్ట్రానికి చెందిన బిజెపి తదితర నేతలు చేస్తున్న ప్రకటలను సిఎం కేసీఆర్ తిప్పికొట్టారు. మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటయిన కిసాన్ సర్కార్ తెలంగాణ మోడల్ పాలలను అమలు చేస్తే…దివాళా తీసేది రైతులు కాదని, అక్కడి రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నేతలేనని సిఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ మోడల్ వస్తే.. రైతుల జీవితాల్లో దీపావళి పండుగ వస్తుందన్నారు. తెలంగాణ మోడల్ ద్వారా మహారాష్ట్రలో ‘‘ రైతులకు దివాళి..పార్టీలకు దివాళా’’ అని స్పష్టం చేశారు.
నేడు తెలంగాణ పాలన దేశానికే ఆదర్శంగా నిలవడానికి మామూలు ప్రభుత్వాలయితే సాధ్యమయ్యేది కాదని, రైతుల కష్టాలు తెలిసిన స్వయంగా రైతుబిడ్డనైన తన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడడం కారణంతోనే తెలంగాణ మోడల్ సాధ్యమైందని పునరుద్ఘాటించారు.
వొక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తూ కాంతిని పంచినట్టు బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు మహారాష్ట్ర ప్రజలను రైతులను తమకోసం తాము చైతన్యమయ్యే దిశగా వారిలో చైతన్యాన్ని రగిలించాలన్నారు. తెలంగాణ నూతన రాష్ట్రం కావడం వలన, పాలన ను స్థిరం చేసుకుని, అన్నిటినీ చక్కదిద్దుకుంటూ రావడానికి సమయం పట్టిందన్నారు. అభివృద్ధి పయనంలో తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడానికి తొమ్మిదేండ్లు పట్టిందనీ, అదే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండేండ్ల లోపే ఆ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలమని సిఎం స్పష్టం చేశారు.
గోదావరి కృష్ణా నదుల జన్మ స్థానమైన మహారాష్ట్ర అద్భతమైన సహజవనరులున్న రాష్ట్రమని అన్నారు. ధనిక రాష్ట్రమైన మహారాష్ట్రను అక్కడి పాలకుల అసమర్థత కారణంగా వెనకబడేసినారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి రైతాంగానికి వ్యవసాయాన్ని తెలంగాణ మాదిరే పండుగ చేసి చూపిద్దామన్నారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీల ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలో పండుతున్న 2 కోట్ల టన్నుల వరి ధన్యాన్ని బియ్యం పట్టే సామర్థ్యం కలిగిన రైస్ మిల్లులను జిల్లాల వారిగా ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగాన్ని లాభాల బాటలో నడిపించబోతున్నామన్నారు. అదే విధానాన్ని మహారాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే అమలులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఉచితంగా తాగునీరు సాగునీరు సహా రెండేండ్లల్లో 24 గంటలు నిరంతరాయ ఉచిత నాణ్యమైన విద్యుత్తును మహారాష్ట్ర రైతులకు అందచేస్తామని పునరుద్ఘాటించారు.
మహారాష్ట్రలో బిఆర్ఎస్ సభ్యత్వం ఇప్పటికే పది లక్షలకు చేరుకున్నదని మరికొన్ని నెలల కాలంలో యాభై లక్షలకు చేరుకోనున్నదని మహారాష్ట్ర కు చెందిన సీనియర్ నేతలు ఈ సందర్భంగా సిఎం కు వివరించారు. కాగా….మహారాష్ట్రలో రైతులనుంచి ప్రజలనుంచి వస్తున్న ప్రతిస్పందనను సిఎం అభినందించారు. మహారాష్ట్ర ప్రజలు మార్పుకోరుకుంటున్నారనే విషయం స్పష్టమైందని అందుకు బిఆర్ఎస్ సభలకు తండోపతండాలుగా తరలివస్తున్న జనసందోహమే నిదర్శనమని సిఎం అన్నారు. మహారాష్ట్ర నుంచే బిఆర్ఎస్ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరిస్తుందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని గ్రామాల వారీగా ప్రతి గ్రామానికి కిసాన్ మహిళా దళిత్ ఆదివాసీ బీసీ యువ వంటి తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేయాలని నేతలకు అధినేత సూచించారు. ఈ కమిటీలన్నీ సమగ్ర సమాచారంతో ప్రజలను చైతన్యపరుస్తూ వారితో క్షేత్రస్థాయిలో మమేకం కావాలన్నారు.

మహారాష్ట్ర కు చెందిన పలు ప్రముఖ పార్టీలకు చెందిన నేతలు బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని చూసి విమర్శలు చేస్తున్న విషయాన్ని అధినేత దృష్టికి తీసుకురాగా…మహారాష్ట్రలో బిఆర్ఎస్ పాగా వేయడం ఖాయమనే విషయం అర్థమయ్యే వారు ఆ విధంగా అభద్రతాభావానికి లోనయ్యి కువిమర్శలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బిఆర్ఎస్ నేతలు శంకరన్నదోంగ్డే, మాణిక్ కదం..తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News