BSNL 4G PM Narendra Modi: ప్రభుత్వ రంగ టెలికా సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు చెందిన ‘స్వదేశీ 4G’ నెట్‌వర్క్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన టెలికాం పరికరాలతో 4జీ సేవలను అందించనున్నట్లు మోదీ తెలిపారు. ‘భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్’ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా మోదీ.. స్వదేశీ 4జీ సేవల్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/tg-local-elections-high-level-review-sec-cs-dgp-meeting/
ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని.. జర్సుగూడలో జరిగిన కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన 97,500 మొబైల్ 4జీ టవర్లను ప్రారంభించారు. ఇందులో 92,600 4జీ టెక్నాలజీ సైట్లు ఉన్నాయి. సౌరశక్తితో నడిచేలా బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూ. 37,000 కోట్లతో వ్యయంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్వదేశీ స్ఫూర్తి బలోపేతం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు.
దేశీయ టెలికాం రంగంలో ఇది కీలకమైన మైలురాయి కానుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒడిశా, ఏపీ, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4G స్వదేశీ టవర్లను ఏర్పాటు చేశారు. ఒడిశాలో సుమారు రూ. 60 వేల కోట్ల వ్యయంతే చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 8 ఐఐటీల విస్తరణ, 2 సెమీ కండక్టర్ల కేంద్రాల నిర్మాణ పనులను భూమి పూజ చేశారు. 60 రైల్వే స్టేషన్ల విస్తరణతో పాటు బ్రహ్మపురం నుంచి సూరత్ వరకు అమృత్‌భారత్ రైలును ప్రారంభించారు.


