Tuesday, July 15, 2025
Homeనేషనల్Gaming Websites: ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా

Gaming Websites: ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా

ఇటీవల విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థల(Online Money Gaming Platforms)పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఎలాంటి అనుమతులు లేకుండా విదేశాల నుంచి అక్రమంగా నిర్వహిస్తోన్న 357 వెబ్‌సైట్లను DGGI బ్లాక్ చేసింది. అంతేకాకుండా ఆ సంస్థలకు చెందిన 2400 బ్యాంక్‌ ఖాతాలను సీజ్ చేసి రూ.126కోట్లను జప్తు చేసింది. అలాగే ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతను DGGI హెచ్చరించింది. ఇకపై ఎవరూ తమ డివైజ్‌లలో మనీ గేమింగ్ వెబ్‌సైట్స్ కలిగి ఉండొద్దని వార్నింగ్ ఇచ్చింది.

- Advertisement -

మరోవైపు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేసిన ప్రముఖులపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో దాదాపు 15 మందిపై కేసు నమోదయ్యాయి. తాజాగా నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మరో ఇద్దరు జబర్దస్త్ ఆర్టిస్టులపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తానికి యువతను బలి తీసుకుంటున్న బెట్టింగ్ మాఫియాపై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News