Friday, November 22, 2024
Homeనేషనల్China: చైనాలో మరోసారి కరోనా కల్లోలం.. గతాన్ని మించి కేసులు

China: చైనాలో మరోసారి కరోనా కల్లోలం.. గతాన్ని మించి కేసులు

China: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి పుట్టినిల్లయిన చైనాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇక్కడ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ వైరస్ పుట్టినపుడు కూడా నమోదు కాని స్థాయిలో ఇప్పుడు ఇక్కడ కేసులు నమోదవుతుండం ఆందోళన కలిగిస్తుంది. గత నాలుగు రోజులుగా ఈ గరిష్ట స్థాయి కేసులు నమోదవుతుండగా.. గత 24 గంటలలో 39,506 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

సామూహిక కరోనా పరీక్షలు, ప్రయాణ పరిమితులు, లాక్‌డౌన్లతో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు యత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కఠినమైన నిర్బంధం విధిస్తున్నారు. మళ్లీ ప్రబలుతున్న కరోనా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. షాంఘై నగరంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా 30 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ ఎలాంటి దారుల పరిస్థితులు నెలకొన్నాయి అర్ధం చేసుకోవచ్చు.

ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త క‌రోనా ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా 5 వేలకు పైగా మరణించినట్టు అధికారిక లెక్కలు చెప్తుండగా.. ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలైన‌ గౌంగ్‌జో, చోంగ్‌కింగ్‌లో ఎక్క‌వ క‌రోనా కేసులు న‌మోదువుతున్నాయి. కొవిడ్‌-19 వైర‌స్‌తో పోరాటం జ‌రుగుతున్న ఈ స‌మ‌యంలో దేశం చాలా క‌ష్ట‌మైన ద‌శ‌లో ఉంద‌ని బీజింగ్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ డిప్యూటీ డైరెక్ట‌ర్ లీ క్జియ‌వోఫెంగ్ అన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో ప్రమాదకరమైన కొత్త వైరస్ స్ట్రెయిన్ ను సైంటిస్ట్ లు కనుగొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News