Monday, May 20, 2024
Homeనేషనల్Choppadandi: మల్లికార్జున్ రెడ్డి లాంటి విద్యావంతులు ఆదర్శం కావాలన్న మోడీ

Choppadandi: మల్లికార్జున్ రెడ్డి లాంటి విద్యావంతులు ఆదర్శం కావాలన్న మోడీ

వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని

ఉన్నత అభ్యసించినప్పటికీ స్వగ్రామంలో వ్యవసాయంపై మక్కువ చూపే మల్లికార్జున్ రెడ్డి లాంటి వారు యువత కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా యువతకు, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం భారత్ వికసిత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రధాని న్యూఢిల్లీ నుండి వర్చువల్ గా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు.

- Advertisement -

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చొప్పదండి పట్టణ కేంద్రంలో ఏర్పాటుచేసిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యోగేష్ మోహన్ దీక్షిత్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిలతో ఎంపీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను వారు పరిశీలించారు.

ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొని తెలంగాణ, రాజస్థాన్ , హర్యానా, మేఘాలయ, మహరాష్ట్ర, రాష్ట్రాలకు చెందిన వారితో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మొదటగా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఉన్నత విద్యను అభ్యసించి కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యోగాన్ని వదులుకొని స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్న మల్లికార్జున్ ఎంతో మందికి ఆదర్శమని ప్రధాని అభివర్ణించారు. అనంతరం ప్రధానమంత్రి యోజన పథకాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పొందిన లబ్ధిని గురుంచి వివరాలను మరియు మల్లికార్జున్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే సెమినార్ ల ద్వారా మల్లికార్జున్ లాంటి వారు యువతకు స్వయం అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. వ్యవసాయంలో భర్తకు చేదోడుగా నిలుస్తున్న మల్లికార్జున భార్య లాంటి వారు భారత నారి శక్తులని అభివర్ణించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న పలు పథకాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేర్చడంతో పాటు పథకాలను గురుంచి అవగాహన కల్పించే దిశగా ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగిందని, ఈ సంకల్ప యాత్రను ఫిబ్రవరి 2024 లో కూడా కొనసాగించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యోగేష్ మోహన్ దీక్షిత్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎల్డియం ఆంజనేయులు, సంక్షేమ శాఖ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, పిడి మెప్మా రవీందర్, ఎన్ఐఓ శ్రీరాములు, వార్డ్ కౌన్సిలర్ మాధురి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శాంత కుమార్, వివిధ శాఖల, అధికారులు బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News