Friday, November 22, 2024
Homeనేషనల్CM Revanth in Finance Commission meeting: తెలంగాణ యంగెస్ట్ స్టేట్, మా రాష్ట్రాన్ని...

CM Revanth in Finance Commission meeting: తెలంగాణ యంగెస్ట్ స్టేట్, మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నాం

నిధుల వాటా 41%-50%కి పెంచండి

హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు.

- Advertisement -

దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్, మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నామంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ..ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని రేవంత్ వివరించే ప్రయత్నం చేశారు.

భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారిందని, గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని, రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు ఇప్పుడు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు రేవంత్.

ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు మాకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని.. లేదా మాకు అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచండి. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నామన్నారు సీఎం.

ఈ డిమాండ్ ను మీరు నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు మేం సంపూర్ణంగా సహకారిస్తామని సీఎం స్పష్టం చేశారు తెలంగాణను మేం ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, తెలంగాణకు తగినంత సహాయం అందించాలని, దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యతను నేరవేరుస్తామన్నారు. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరుతున్నామన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయోగపడతాయని మేం నమ్ముతున్నామంటూ సీఎం రేవంత్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News