Wednesday, January 15, 2025
Homeనేషనల్Congress New Office: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం

Congress New Office: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం

ఐదు దశాబ్దాల తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం(Congress New Office) ప్రారంభమైంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ దీనిని ప్రారంభించారు. ఈ కార్యాలయానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, తదితర నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

కాగా ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో పార్టీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. 1978 నుంచి ఈ ఆఫీస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా కొనసాగింది. ప్రస్తుతం 9A కోట్లా రోడ్డులో ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త పార్టీ ఆఫీసును నిర్మించుకుంది. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం పనులు ప్రారంభించగా.. నిర్మాణం పూర్తి చేయడానికి సుమారు 15 ఏళ్లు పట్టడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News