Wednesday, October 30, 2024
Homeనేషనల్Delhi: మోడీపై కోర్టుకెక్కిన 14 ప్రతిపక్ష పార్టీలు

Delhi: మోడీపై కోర్టుకెక్కిన 14 ప్రతిపక్ష పార్టీలు

కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ కోర్టుకెక్కేందుకు 14 విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి.  ఈమేరకు సుప్రీంకోర్టులో కేంద్రం చర్యలపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి విపక్షాలు.

- Advertisement -

ఈమేరకు అత్యున్నత ధర్మాసనం వద్ద విపక్ష పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం బీజేపీ రాజకీయ ప్రత్యర్థ పార్టీలనే టార్గెట్ చేస్తున్నాయని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అదే బీజేపీలో చేరితే మాత్రం తక్షణం కేసులను భూస్థాపితం చేయటం అనే సంఘటనలు తరచూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రక్రియగా మారిందని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై గైడ్ లైన్స్ జారీ చేయాల్సిందిగా విపక్ష పార్టీల బృందం సుప్రీంకోర్టును కోరింది. కాగా ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ స్వతంత్రంగా వ్యవహరిస్తాయని వెల్లడించింది.

సుప్రీం కోర్టులో ఈమేరకు పిటిషన్ దాఖలు చేసిన పార్టీల్లో.. కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతా దళ్ యునైటెడ్, భారత రాష్ట్ర సమితి, రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం),  నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్, డీఎంకే పార్టీలున్నాయి.

95 శాతం ఈడీ కేసులు ఇలా రాజకీయ కక్షతో కూడినవేనంటూ ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు ఈ బ్రహ్మాస్త్రాలను బీజేపీ ప్రయోగిస్తోందని ప్రతిపక్ష పార్టీలు న్యాయపోరాటానికి దిగాయి. ఈమేరకు బీజేపీ అధికారంలోకి వచ్చాక గత 9 ఏళ్లుగా ఫైల్ అయిన కేసుల డేటాను ధర్మాసనానికి ఈ 14 పార్టీలు అందజేసాయి.

అయితే ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత లేక సతమతమవుతున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఇలా 14 రాజకీయ పార్టీలు కలిసి కోర్టుకెక్కటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News