దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ధర్మాగ్రహానికి సిద్ధమై, రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేయనున్నాయి. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకూ ఈ పాదయాత్ర జరుగనుంది. కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీలను వేధిస్తున్న తీరును ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ఈ మార్చ్ నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ ఈమేరకు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పాదయాత్రను నిర్వహిస్తోంది.
- Advertisement -
మోడీ అనే సామాజిక వర్గాన్ని యావత్తు దొంగలని కించపరిచిన రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది. ఇది బీసీలను అవమానించటమేనని మోడీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేతలంతా మండిపడుతున్నారు.