వచ్చే ఏడాదిలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్(Divya Sathyaraj) అధికార డీఎంకే(DMK) పార్టీలో చేరారు. చెన్నైలో ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) సమక్షంలో ఆమె డీఎంకే కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను పార్టీలోకి సీఎం స్టాలిన్ సాదరంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ ప్రజా సేవపై ఆసక్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. తాను చిన్నప్పటి నుంచి డీఎంకే విధానాల పట్ల ఆకర్షితురాలియ్యానని పేర్కొన్నారు. డీఎంకే మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ అని కొనియాడారు. కాగా న్యూట్రిషనిస్టు అయిన దివ్య సత్యరాజ్ 2021 ఎన్నికల సమయంలోనే స్టాలిన్‌ను కలిశారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.