మనదేశం ఈ ఏడాది గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తుందని ఎకనమిక్ సర్వే అంచనాలున్నట్టు తెలుస్తోంది. 2023-24 జీడీపీ 6-6.8 శాతం ఉంటుందని ఎకనమిక్ సర్వే అంచనా వేసినట్టు రాయిటర్స్ సంస్థ వెల్లడిస్తోంది. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ ఎకనమిక్ సర్వేను మరికాసేపట్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందురోజు ఎకనమిక్ సర్వేను పార్లమెంట్ కు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది.
కాగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనాలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. తాజాగా ఐఎంఎఫ్ వెల్లడించిన ప్రపంచ ఆర్థిక నివేదిక రిపోర్టులో భాగంగా 2022లో మనదేశం 6.8 శాతం వృద్ధి సాధించగా ఇది కాస్త మందగించి 2023లో 6.1 శాతంతో సరిపెట్టుకోవచ్చని చెబుతోంది. 2024 సంవత్సరంలో వృద్ధి రేటు పరుగులు పెడుతూ 6.8 శాతం నమోదవుతుందని ఐఎంఎఫ్ చెబుతోంది.
ఇండియా బ్రైట్ స్పాట్ గా ఉంటుందన్న ఐఎంఎఫ్, గ్లోబల్ గ్రోత్ రేట్ 2.9 శాతానికి పడిపోతుందని హెచ్చరించింది.