తనను బద్నాం చేసేందుకు బీజేపీ సర్వం ఒడ్డుతోందంటూ కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మండిపడుతున్నారు. తన పేరు ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కుట్ర పన్నిని బీజేపీ తనపై ఓ కొత్త పుస్తకాన్నే రిలీజ్ చేస్తోందని సిద్ధు ధ్వజమెత్తారు. ఇందులో తాను సీఎంగా ఉన్న కాలంలో ఏవేవో చేశానంటూ లేనిపోని కల్పితాలు ప్రచురించినట్టు సిద్ధూ ఆరోపిస్తున్నారు. ‘సిద్ధు నిజకనసుగళు’ అనే పేరుతో వస్తున్న పుస్తకంలో తన హయాంలో జరిగిన మత ఘర్షణలపై సిద్ధూ ఓ వర్గానికి కొమ్ము కాచారంటూ వక్రీకరించి వర్ణించారనేది సిద్ధూ బాధ. ఈ ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తనపై వచ్చిన పుస్తకాన్ని అడ్డుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవటంపై సిద్ధూ ఫోకస్ పెట్టారు. ఈ పుస్తకం కవర్ స్టోరీగా సిద్ధు టిప్పు సుల్తాన్ గెటప్ లో ఉండటం మరో వివాదంగా మారింది. కాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతితో తన బయోపిక్ సైతం తీయించుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా బరిలో దిగే ప్రయత్నంలో ఉన్నారు ఈయన.