Saturday, November 15, 2025
Homeనేషనల్Electric Vehicles: 4-6 నెలల్లో పెట్రోల్ వాహనాలతో సమానంగా EV ధరలు.. నితిన్ గడ్కరీ సంచలన...

Electric Vehicles: 4-6 నెలల్లో పెట్రోల్ వాహనాలతో సమానంగా EV ధరలు.. నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన

Electric Vehicles To Cost Same As Petrol Vehicles: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా ఉంటాయని ఆయన సోమవారం ప్రకటించారు.

- Advertisement -

ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. శిలాజ ఇంధనాలపై భారతదేశం ఆధారపడటం వల్ల ఏటా రూ. 22 లక్షల కోట్లు ఇంధన దిగుమతులపై ఖర్చవుతోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు భారంతో పాటు పర్యావరణానికి ముప్పుగా మారుతోందని గడ్కరీ నొక్కి చెప్పారు. అందుకే దేశ ప్రగతికి స్వచ్ఛమైన ఇంధన విధానాన్ని (Clean Energy Adoption) స్వీకరించడం అత్యంత కీలకం అని ఆయన అన్నారు.

ALSO READ: Karur Stampede: “క్షమాపణ చెప్పి, తప్పు ఒప్పుకోవాల్సిన సమయమిది”.. కరూర్ తొక్కిసలాటపై కమల్ హాసన్

భారత ఆటోమొబైల్ పరిశ్రమపై దృష్టి

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని గడ్కరీ తెలిపారు. “నేను రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లు. ఇప్పుడు అది రూ. 22 లక్షల కోట్లకు పెరిగింది” అని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలో యూఎస్ ఆటోమొబైల్ పరిశ్రమ (రూ. 78 లక్షల కోట్లు) అగ్రస్థానంలో ఉండగా, చైనా (రూ. 47 లక్షల కోట్లు) తర్వాతి స్థానంలో ఉంది. తమ లక్ష్యం మేరకు ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో నిలపాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దీనికి తోడు, మొక్కజొన్న (Corn) నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా రూ. 45,000 కోట్లు ఆదాయం పొందారని గడ్కరీ తెలిపారు. అలాగే, 2027 నాటికి దేశంలో వేరు చేయబడిన ఘన వ్యర్థాలన్నింటినీ రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకతను నొక్కి చెబుతూ, యువతకు సరైన విద్య, నైపుణ్యాలు అందిస్తే ప్రపంచంలో మనం దూసుకుపోగలమని మంత్రి అన్నారు.

ALSO READ: Project Himank: లడఖ్‌లో 19,400 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad