జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి(Pahalgam Terror Attack) ప్రతీకారంగా భారత ఆర్మీ ఉగ్రవాదుల ఏరివేత పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే బసంత్‌గఢ్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ముష్కరులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో(Encounter) ఆర్మీ జవాన్ వీర మరణం పొందారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది. బేస క్యాంపుల నుంచి భారీ మొత్తంలో అదనపు బలగాలను ఆర్మీ అధికారులు తరలిస్తున్నారు.
మరోవైపు కశ్మీర్ పర్యాటక రంగం పరిరక్షణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఆర్మీ, పారా మిలటరీ బలగాలను శాశ్వతంగా మోహరిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే దాయాది పాకిస్థాన్ దేశంపై కఠిన ఆంక్షలు విధించింది. సింధు జలాల నిలిపివేత, ఇండస్ వాటర్ ఒప్పందం రద్దు వంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది.