సాధారణంగా నిద్రలో ఎన్నో రకాల కలలు కంటుంటాం. అయితే డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ప్రతి కల మనల్ని భవిష్యత్తు సంఘటనల వైపు చూపిస్తుంది. దీనితో పాటు కొన్ని కలలు కూడా మన మనసులో సంచరిస్తూ మనల్ని ఆలోచింపజేస్తాయి. కొన్ని కలలు చాలా భయానకంగా ఉంటాయి, మన నిజ జీవితంలో వాటి గురించి ఆలోచించడం కూడా మనల్ని భయపెడుతుంది. ఇలా చాలా సార్లు కలలో దయ్యాలు కనిపిస్తాయి. అలాంటి కలలు కనడం వల్ల మీరు భయపడి నిద్రలేస్తారు.
అయితే దెయ్యాలు వెంటాడుతున్నట్లు, అవి మీపై దూకినంట్లు, దాడి చేసినట్లు చాలా మందికి కలలు కనిపిస్తాయి. నిజానికి ఇలాంటి కలలు వస్తే ఏమవుతుంది.. ఇవి నిజం అవుతాయా అన్న సందేహాలు అందరికీ వస్తుంటాయి. ఇవే నిజానికి కలలు భవిష్యత్తులో జరగే ఘటనలకు సంకేతమని చెపుతారు. భవిష్యత్ లో జరగాల్సిన విషయాలను కొన్ని సంకేతాల రూపంలో ముందే హెచ్చరిస్తుంది అనేది చాలామంది నమ్ముతారు. అయితే ఇలా దెయ్యాలు కలలో కనిపిచడానికి కారణం ఒకటే అంటున్నారు శాస్త్రవేత్తలు.
నిజానికి జీవితంపై భయం ఉన్నవారు.. రేపు ఏమవుతుందో అనే టెన్షన్ ఉన్నవారికే కలలో దెయ్యాలు కనిపిస్తాయట. ఈ విషయాలు డ్రీమ్స్ సైన్స్ ఒక బుక్ లో కూడా ఉంది. దెయ్యాలు, భూతాలు ఉంటాయి అనేది.. మనుషుల నమ్మకాలను బట్టి ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు దెయ్యం ఉందని నమ్ముతారు. రోజూ నిద్రలో దెయ్యాలు కనిపిస్తున్నాయి అంటే మాత్రం.. వారు జీవితంలో ఏదో కోల్పోయిన బాధలో ఉన్నారని అర్ధం అంట. ఇక డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో దెయ్యాలు కనిపించడం అనేది చెడు సంకేతం. మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లు సంకేతం. మానసికంగా బలంగా లేరని అర్ధం.
మానసికంగా ధృడంగా ఉన్నవారు జీవితంలో ఎన్నో సాధించాలని.. ముందుకు వెళ్లాలని చూస్తూ ఉంటారు. అలాంటివారు నిద్ర పోయేముందు రేపు ఇంకా బెటర్ గా ఉండాలని మనసులో అనుకోని పడుకుంటారు. కానీ మానసికంగా బలం లేనివారు రేపు ఏం జరుగుతుందో అనే భయంతో పడుకుంటారు. దీంతో వారికి దెయ్యం కలలు వస్తుంటాయి. కొందరు ఎమోషనల్ గా ఉన్నప్పుడు. జీవితంలో ఏదైనా నచ్చింది కోల్పోయినప్పుడు.. ఒకే విషయం గురించి ఆలోచించినప్పుడు కూడా దెయ్యాలు కలలోకి వస్తాయంట. ఇక దెయ్యంతో మీరు పోరాడినట్లు కలలో కనిపిస్తే.. భవిష్యత్ లో మీరు సాధించే విజయానికి ఏదో అడ్డుపడుతున్నట్లు తెలిపే సంకేతమని చెప్తున్నారు.
దెయ్యాలు కలలో కనిపిస్తున్నాయంటే జాగ్రత్త గా ఉండాలని మానసిక వైద్యులు కూడా చెపుతున్నారు. మనో మనో ధైర్యంతో ముందుకు వెళ్తూ.. దెయ్యాలని తరిమికొట్టాలని సూచిస్తున్నారు. (గమనిక : ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించడం లేదు.)