Monday, July 8, 2024
Homeనేషనల్Goa: గోవాలోన్యూ ఎయిర్ పోర్ట్..హైదరాబాద్ నుంచి డైలీ విమాన సర్వీసులు

Goa: గోవాలోన్యూ ఎయిర్ పోర్ట్..హైదరాబాద్ నుంచి డైలీ విమాన సర్వీసులు

న్యూ గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. మోపా వద్ద నిర్మించిన న్యూ గోవా ఎయిర్ పోర్టుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇండిగో, గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ డైలీ విమాన సర్వీసులు ప్రారంభించింది.

- Advertisement -

నార్త్ గోవాలోని పెర్నెం తాలూకాలో అత్యాధునికంగా ఈ కొత్త ఎయిర్ పోర్ట్ ను నిర్మించారు. కాగా త్వరలో ఆకాశ విమాన సర్వీసెసులు కూడా హైదరాబాద్ నుంచి గోవాకు ప్రారంభం కానున్నాయి.

మోపాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గోవా పాత ఎయిర్ పోర్ట్ సౌత్ గోవాలోని దబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ బిల్డింగ్స్, రన్ వే పై ఎల్ఈడీ లైట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి సకల హంగులతో ఈ కొత్త ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావటంతో గోవాకు వెళ్లే పర్యాటకులకు మరిన్ని సదుపాయాలు అందనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News