ముంబైలోని ఓ అమ్మాయి ఫుల్ హ్యాంగోవర్ లో ఉంది.. ఆ హ్యాంగోవర్ లో ఆమెకు బిర్యానీ తినాలనిపించింది. అంది కూడా బెంగళూరులో ఫేమస్ అయిన మేఘనా ఫుడ్స్ నుంచి ఆమె ఏకంగా ముంబైకి బిర్యాన్ ఆర్డర్ చేసింది. దీంతో జొమాటో వారు మరుసటి రోజు బెంగళూరు మేఘనా ఫుడ్ నుంచి బిర్యానీని ముంబైలో ఆమెకు డెలివరీ చేశారు. ఈ మొత్తానికి అయిన బిల్లు 2,500 రూపాయలు. అయితే మరుసటి రోజు బిర్యానీ డెలివరీ తీసుకున్న ఆమె తాను ఓ మంచి పని చేసినట్టు, ఎటువంటి బాధ పడట్లేదని మరీ సోషల్ మీడియాలో తన హ్యాంగోవర్ స్టోరీ అంతా పోస్ట్ చేసింది.