Sunday, December 8, 2024
Homeనేషనల్BJY: ఆ అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా.. రాహుల్ గాంధీ

BJY: ఆ అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా.. రాహుల్ గాంధీ

ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టు తీస్తే అందులో ఫస్ట్ ఉండే పేరు రాహుల్ గాంధీనే. ఈయనకు తరచూ ఇంటర్వ్యూల్లో తప్పకుండా ఎదురయ్యేది పెళ్లెఫ్పుడనే. భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కర్లీ టేల్స్ అనే యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై స్పందించారు.

- Advertisement -

సరైన అమ్మాయి దొరగ్గానే పెళ్లి చేసుకుంటానని, ఆ అమ్మాయి ప్రేమగా ఉండి, తెలివైనదై ఉంటే చాలని ఆయన బదులివ్వటం విశేషం. గతంలో నాన్నమ్మ, అమ్మలా ఉన్న అమ్మాయి దొరికితే అంటూ సగటు అబ్బాయి పెళ్లి సంగతులు చెప్పినట్టు చెప్పిన రాహుల్ గాంధీ..ఈసారి మాత్రం చాలా సింపుల్ గా సమాధానం ఇవ్వటం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News