Sunday, November 16, 2025
Homeనేషనల్Amit shah: 'మావోయిస్టులు లొంగిపోవాల్సిందే.. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు'

Amit shah: ‘మావోయిస్టులు లొంగిపోవాల్సిందే.. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు’

Amit shah sensational comments on Maoists: మావోయిస్టుల అంశంపై కేంద్ర హెూంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అన్నారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని పేర్కొన్నారు.

- Advertisement -

మావోయిస్టు రహిత దేశమే లక్ష్యం: ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని అన్నారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఆ విధంగా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని తెలిపారు. పునరావాసం సైతం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని మరోసారి పునరుద్ఘాటించారు.

ఆయుధాలు శాంతికి విఘాతం: మావోయిస్టులు తమతో చర్చలు జరపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని అమిత్ షా అన్నారు. వారు చర్చలు కోరుతున్నప్పటికీ.. ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని ప్రశ్నించారు. బస్తర్‌ అంతటా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. అందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తూనే ఉంటాయని మావోయిస్టులను హెచ్చరించారు.

Also read: https://teluguprabha.net/national-news/bjp-slams-rahul-gandhi-colombia-remarks-democracy/

అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోలేరు: 2026 మార్చి 31 తర్వాత దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని హెూంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇక అప్పటినుంచి గ్రామాల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోలేరని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధి కోసం రూ.4లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని హెూంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad