Sunday, November 16, 2025
Homeనేషనల్Ceasefire: కాల్పుల విరమణకు భారత్-పాక్ మధ్య ఒప్పందం

Ceasefire: కాల్పుల విరమణకు భారత్-పాక్ మధ్య ఒప్పందం

భారత్- పాకిస్థాన్(India- Pakistan) దేశాలు కాల్పుల విరమణకు(Ceasefire) అంగీకారం తెలిపాయి. ఈమేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగినట్లు భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ కీలక ప్రకటన చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిందన్నారు. కొద్దిసేపటి క్రితం పాక్ DGMO భారత ఆర్మీ అధికారులతో మాట్లాడారని తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య అన్ని రకాల మిలిటరీ ఆపరేషన్స్ ఆగిపోయాయని వెల్లడించారు. అలాగే ఈనెల 12న పాకిస్థాన్ దేశంతో శాంతి చర్చలు జరుపుతామని ఆయన వివరించారు.

- Advertisement -

ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య శాంతి కోసం అమెరికా మధ్యవర్తిత్వం వహించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తక్షణమే సీజ్‌ఫైర్‌కు భారత్-పాక్ అంగీకరించాయని స్పష్టం చేశారు. దీంతో రెండు దేశాలకు ట్రంప్ అభినందనలతో యుద్ధం ఆపడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad